కారణమిదీ: ఐటీ విచారణకు కెఎల్ఆర్, పారిజాత నరసింహరెడ్డి గైర్హాజర్

Google News Follow Us

సారాంశం

తెలంగాణ రాష్ట్రంలో ఆదాయపన్ను శాఖాధికారుల సోదాలు కలకలం రేపుతున్నాయి. ఎన్నికల సమయంలో కొందరు కాంగ్రెస్ నేతలను  ఐటీ అధికారులు విచారణకు రావాలని  పిలిచారు.

హైదరాబాద్:  ఆదాయ పన్ను శాఖాధికారుల  విచారణకు  కాంగ్రెస్ నేతలు చిగురింత పారిజాత నరసింహరెడ్డి,  కిచ్చెన్నగారి లక్ష్మారెడ్డిలు గైర్హాజరయ్యారు.  తమ తరపున  చార్టెడ్ అకౌంటెంట్లను  పంపారు.

ఈ నెల  2వ తేదీన ఉదయం  కాంగ్రెస్ నేతలు, చిగురింత పారిజాత నరసింహరెడ్డి, కిచ్చెన్నగారి లక్ష్మారెడ్డి, భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి  బంధువు  గిరిధర్ రెడ్డి నివాసాల్లో  ఆదాయపన్ను శాఖాధికారులు సోదాలు నిర్వహించారు.  ఈ నెల  3వ తేదీ ఉదయం  వరకు కూడ ఈ సోదాలు సాగాయి.ఈ నెల  3వ తేదీన జానారెడ్డి  తనయుడు  రఘువీర్ రెడ్డి నివాసంలో కూడ  ఐటీ అధికారులు సోదాలు చేశారు.

రెండు రోజుల పాటు  పారిజాత నరసింహరెడ్డి,  కెఎల్ఆర్ నివాసాల్లో  ఆదాయపన్ను శాఖాధికారులు  సోదాలు  చేశారు. కాంగ్రెస్ నేతల  ఇళ్లలో  సోదాల సమయంలో  పలు కీలక డాక్యుమెంట్లను, నగదును  ఐటీ అధికారులు సీజ్ చేశారు.  అయితే  ఎన్నికల ప్రచారంలో  ఉన్నందున  విచారణకు  రాలేనని  కెఎల్ఆర్  ఐటీ శాఖాధికారులకు సమాచారం పంపారు.  తన తరపున  తన చార్టెడ్ అకౌంటెంట్ ను  పంపారు.

 మరో వైపు  బడంగ్ పేట మున్సిపల్ చైర్ పర్సన్  పారిజాత నరసింహరెడ్డి  దంపతులు  కూడ ఐటీ విచారణకు హాజరు కాలేదు.  తమ తరపున  చార్టెడ్ అకౌంటెంట్ ను పంపారు.  ఇదిలా ఉంటే  పారిజాత నరసింహరెడ్డి దంపతులకు  ఐటీ అధికారులు ఇవాళ  ఫోన్ చేశారు.  ఏ రోజున విచారణఖకు రావాలో  సమాచారం ఇస్తామని  చెప్పారని సమాచారం.  నాలుగు రోజుల తర్వాత పారిజాత నరసింహరెడ్డి దంపతులను  విచారణకు  ఐటీ శాఖాధికారులు విచారణకు  పిలిచే అవకాశం ఉంది.

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో  బరిలో ఉంటున్న  కాంగ్రెస్ పార్టీకి చెందిన  అభ్యర్ధులపై బీజేపీ  ఐటీ అధికారులతో దాడులు చేయిస్తుందని  కాంగ్రెస్ ఆరోపణలు చేసింది.  బీఆర్ఎస్ కు ప్రయోజనం చేసేందుకే  బీజేపీ కాంగ్రెస్ నేతల ఇళ్లపై దాడులు చేస్తుందని  టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. ఐటీ దాడులకు  భయపడేప్రసక్తే లేదని ఆయన  స్పష్టం చేశారు.

also read:జానారెడ్డి నివాసంలో ఐటీ అధికారుల సోదాలు: రెండో రోజూ కాంగ్రెస్ నేతల ఇళ్లలో సాగుతున్న దాడులు

ఈ నెల 2, 3 తేదీల్లో  నిర్వహించిన సోదాలకు సంబంధించి  కెఎల్ఆర్, పారిజాత నరసింహరెడ్డిలను  ఇవాళ విచారణకు రావాలని ఐటీ అధికారులు  ఆదేశించారు. అయితే  తమ తరపున  చార్టెడ్ అకౌంటెంట్లను మాత్రమే పంపారు.