సీఎం కేసీఆర్ ప్రయాణిస్తున్న హెలికాప్టర్‌లో సాంకేతిక సమస్య.. పూర్తి వివరాలు ఇవే..

Published : Nov 06, 2023, 01:34 PM ISTUpdated : Nov 06, 2023, 02:22 PM IST
సీఎం కేసీఆర్ ప్రయాణిస్తున్న హెలికాప్టర్‌లో సాంకేతిక సమస్య.. పూర్తి వివరాలు ఇవే..

సారాంశం

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ హెలికాప్టర్‌లో సాంకేతిక లోపం తలెత్తింది.

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ హెలికాప్టర్‌లో సాంకేతిక లోపం తలెత్తింది. కేసీఆర్ ప్రయాణిస్తున్న హెలికాప్టర్‌లో సాంకేతిక సమస్య తలెత్తడంతో పైలట్ అప్రమత్తమయ్యారు. దీంతో వెంటనే హెలికాప్టర్‌ను అత్యవసరంగా ల్యాండింగ్ చేశారు. వివరాలు.. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా సీఎం కేసీఆర్..బీఆర్ఎస్ అభ్యర్థుల తరఫున ప్రచారం నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలోనే ఈరోజు పాలమూరులోని దేవరకద్ర, మక్తల్‌, నారాయణపేట, గద్వాల నియోజకవర్గాల్లోని ప్రజా ఆశీర్వాద సభలకు కేసీఆర్ హాజరుకావాల్సి ఉంది. 

దీంతో కేసీఆర్ ఈరోజు సోమవారం ఉదయం ఎర్రవల్లి వ్యవసాయ క్షేత్రం నుంచి హెలిక్యాప్టర్‌లో దేవరకద్రకు బయలుదేరారు. అయితే కేసీఆర్ ప్రయాణిస్తున్న హెలికాప్టర్‌లో సాంకేతిక సమస్య తలెత్తడంతో పైలట్ అప్రమత్తమయ్యారు. దీంతో వెంటనే హెలికాప్టర్‌ను ఎర్రవల్లి వ్యవసాయ క్షేత్రంలోనే క్షేమంగా ల్యాండ్ చేశారు. దీంతో ఏవియేషన్ సంస్థ ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తుంది. ప్రత్యామ్నాయ హెలికాప్టర్ రాగానే సీఎం కేసీఆర్ యథావిథిగా పాలమూరుకు వెళ్లనున్నారు. అయితే కేసీఆర్ హెలికాప్టర్‌లో సాంకేతిక లోపం తలెత్తిందనే వార్తతో బీఆర్ఎస్ శ్రేణులు కొంత ఆందోళనుకు గురయ్యాయి.

PREV
Read more Articles on
click me!