కేసీఆర్‌కు తెలిసింది రెండే.. ఒకటి అప్పులు, రెండు లిక్కర్ సేల్స్: కిషన్ రెడ్డి

By sivanagaprasad kodatiFirst Published Oct 17, 2018, 2:10 PM IST
Highlights

టీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌పై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు బీజేపీ నేత కిషన్ రెడ్డి. నాంపల్లిలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ... గత ఎన్నికల్లో ఎంత వరకు హామీలు అమలు చేశారో కేసీఆర్ నిన్న చెప్పాల్సింది.

కనురెప్పపాటు కూడా కరెంట్ కూడా పోదని.. మిషన్ భగీరథ నీళ్లు రాకపోతే ఓట్లు అడగనన్న టీఆర్ఎస్ అధినేత.. సమాధానం చెప్పలేకే ముందస్తు ఎన్నికలకు సిద్ధమయ్యారని ఆరోపించారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ మినహా మిగిలిన ఏ ప్రాజెక్ట్‌కు డబ్డులు ఇవ్వడం లేదన్నారు..

తెలంగాణ విద్యుత్ శాఖ అప్పులమయమైందని కిషన్‌రెడ్డి విమర్శించారు. కేసీఆర్‌కు తెలిసింది ఒకటి అప్పులు చేయడం.. రెండు లిక్కర్ సేల్స్ మాత్రమేనన్నారు.. హమీలపై బహిరంగ చర్చకు టీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు సిద్ధమా అని సవాల్ విసిరారు.

ఓట్లు, సీట్లు, అధికారం తప్పించి ఆ పార్టీలకు ప్రజా సమస్యలపై చిత్తశుద్ధి లేదని కిషన్‌రెడ్డి ఎద్దేవా చేశారు. మోడీ ఇంటి నుంచి ఇస్తున్నారా అని కేటీఆర్ విమర్శిస్తున్నారని.. మరి మీ హామీలను శ్రమదానం చేసి అమలు చేస్తారా అని ఆయన ప్రశ్నించారు. బీజేపీ వంట చేసి పెట్టే పార్టీ కాదని.. వంట ఎలా చేయాలో నేర్పే పార్టీ అని కిషన్‌రెడ్డి స్పష్టం చేశారు.

click me!