ఫేస్‌బుక్‌లో మహిళకు నగ్నచిత్రాలు: షాకిచ్చిన బాధితురాలు

Published : Oct 17, 2018, 01:18 PM IST
ఫేస్‌బుక్‌లో మహిళకు నగ్నచిత్రాలు: షాకిచ్చిన బాధితురాలు

సారాంశం

ఓ మహిళకు ఫేస్‌బుక్‌లో  అసభ్య సందేశాలు, చిత్రాలు పంపుతూ  వేధిస్తున్న యువకుడిని రాచకొండ సైబర్ క్రైం పోలీసులు  మంగళవారం నాడు  అరెస్ట్ చేశారు.   


నాగోలు:  ఓ మహిళకు ఫేస్‌బుక్‌లో  అసభ్య సందేశాలు, చిత్రాలు పంపుతూ  వేధిస్తున్న యువకుడిని రాచకొండ సైబర్ క్రైం పోలీసులు  మంగళవారం నాడు  అరెస్ట్ చేశారు. 

కర్ణాటక రాష్ట్రంలోని బీదర్‌కు చెందిన  ఓ మహిళ తన కుటుంబంతో పాటు ఈసీఐఎల్‌లో నివాసం ఉంటుంది.ఆమె ప్రైవేట్ ఉద్యోగం చేస్తోంది. ఫేస్‌బుక్‌లో పరిచయమైన  ఓ యువతి ద్వారా  సంతోష్‌నగర్‌లోని రియాసత్‌నగర్‌కు చెందిన  ఎండీ అజహర్‌ఖాన్ అనే యువకుడు  ఆమెకు ఫేస్‌బుక్ లో పరిచయమయ్యాడు.

అజహర్‌ఖాన్ ఫేస్‌బుక్ ఫ్రెండ్ ద్వారా  ఈ మహిళతో అజహర్‌ఖాన్ ఫ్రెండ్ గా మారాడు.  అయితే తరచూ ఆమెతో చాటింగ్ చేసేవాడు.  అయితే చాటింగ్ సమయంలో ఆ మహిళ అజహర్‌ఖాన్‌తో దురుసుగా  వ్యవహరించిందని కక్ష పెంచుకొన్నాడు.

ఈ ఏడాది సెప్టెంబర్ 13 తేదీ నుండి  ఫేస్‌బుక్‌లో ఆమెకు అసభ్యకరమైన  సందేశాలు, ఫోటోలు పంపుతున్నాడు. అంతేకాదు ఇంటర్నెట్‌లోని నగ్న చిత్రాలను ఆ మహిళ ముఖాన్ని మార్పింగ్ చేసి ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేశాడు.

ఈ ఫోటోలను తీసేయాలని బాధితురాలు  అతడిని కోరింది.  అయినా అతను పట్టించుకోలేదు. దీంతో  ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో రాచకొండ పోలీసులు నిర్భయ కేసు నమోదు చేశారు.నిందితుడు ఉపయోగించి కంప్యూటర్, మొబైల్ ఆధారంగా మంగళవారం నాడు  అతడిని అరెస్ట్ చేశారు.


 

PREV
click me!

Recommended Stories

Real estate: హైద‌రాబాద్‌లోని ఈ శివారు ప్రాంతం మ‌రో కూక‌ట్‌ప‌ల్లి కావ‌డం ఖాయం.. ఇప్పుడే కొనేయండి
Free Bus Scheme : తెలుగోళ్లకు గుడ్ న్యూస్... మహిళలకే కాదు పురుషులకు కూడా ఉచిత బస్సు ప్రయాణం