
చనిపోయిన శవాలకు కూడా వైద్యం పేరుతో డబ్బులు దండుకోవడం ప్రైవేట్ హాస్పిటళ్లలో చూస్తుంటాం. కానీ ఈ సీన్ ఇపుడు ప్రభుత్వ హాస్పిటల్ లో రిపీటయ్యింది. ఇది మెడికల్ హబ్ గా చెప్పుకుంటున్న భాగ్యనగరంలో జరిగిన విషాద సంఘటన.
వివరాల్లోకి వెళితే....యాదాద్రి భువనగిరి జిల్లా తుర్కపల్లికి చెందిన తాటికొండ సంధ్య గర్భవతి. ఆమెను ప్రసవం కోసం నగరంలోని కింగ్‌కోఠి ప్రసూతి ఆస్పత్రికి తీసుకువచ్చారు. మగబిడ్డకు జన్మనిచ్చిన ఆమెను పరీక్షించిన వైద్యులు ఆరోగ్యం బాగుందని చెప్పారు.
బాలింత మరణించి గంటకు పైగానే అయింది. అలస్యంగా గుర్తించిన సిబ్బంది హడావిడి చేశారు. సీరియస్‌గా ఉందంటూ హుటాహుటిన గాంధీ ఆస్పత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు చనిపోయి రెండు గంటలవు తుందని ప్రకటించారు. దీంతో మృతురాలి బంధువులు కింగ్‌కోఠి ప్రసూతి ఆస్పత్రి ఎదుట ధర్నాకు దిగారు.
అయితే కొద్దిసేపటి తర్వాత మందులు వేసేందుకు నర్సులు ఆమెను పైకి లేపగా లేవలేదు. మరణించినట్టు నిర్ధారణకు వచ్చినప్పటికి, సంధ్య పరిస్థితి ఆందోళనకరంగా ఉందంటూ హడావిడి చేశారు. పరిస్థితి విషమంగా ఉందని భావించిన కుటుంబసభ్యులు సంధ్యను గాంధీ ఆస్పత్రికి తరలించారు. అయితే ఆమెను పరీక్షించిన వైద్యులు ఆమె మరణించి రెండు గంటలు దాటిందని చెప్పారు. విషయం అర్థమైన సంధ్య భర్త, బంధువులు మృతదేహంతో కింగ్‌కోఠి ఆస్పత్రి వద్ద ఆందోళన చేశారు. వైద్యులు, సిబ్బంది నిర్లక్ష్యం కారణంగా తన భార్య మరణించిందని శ్యాం సుందర్ ఆరోఫించారు.