మరో వివాదంలో ఎమ్మెల్యే శంకర్ నాయక్

Published : Aug 03, 2017, 06:07 PM ISTUpdated : Mar 25, 2018, 11:40 PM IST
మరో వివాదంలో ఎమ్మెల్యే శంకర్ నాయక్

సారాంశం

ఎమ్మార్వో సీటులో కూర్చున్న శంకర్ నాయక్ నేను వస్తున్నానని తెలిసినా ఎమ్మార్వో ఎటు వేళ్లాడని ఆగ్రహం ఆ సమయంలో నేలవంచలో గ్రామసభలో ఉన్న ఎమ్మార్వో

తెలంగాణలోని మహబూబాబాద్ ఎమ్మెల్యే శంకర్ నాయక్ మరో వివాదంలో ఇరుక్కున్నారు. గతంలో మహబూబాబాద్ కలెక్టర్ ప్రీతిమీనా చేయి పట్టుకున్న వివాదంలో ఆయన ఇరికిపోయిన విషయం తెలిసిందే. తాజాగా ఎమ్మార్వో సీట్లో కూర్చుని అధికారులపై చిర్రుబుర్రులాడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు.

ఈ సంఘటన గూడూరు మండలంలో జరిగింది. విశ్వసనీయ సమాచారం మేరకు వివరాలిలా ఉన్నయి. బుధవారం ఎమ్మెల్యే శంకర్ నాయక్ గూడూరు ఎమ్మార్వో ఆఫీసుకు వెళ్లారు. ఆ సమయంలో ఎమ్మార్వో ఎం.ఎ.రాజు ఆఫీసులో లేడు. నేలవంచ గ్రామంలో జరిగిన గ్రామసభలో పాల్గొన్నారు. ఆ సమయంలో ఎమ్మెల్యే వెళ్లి ఎమ్మార్వో ఆఫీసులోని ఎమ్మార్వో సీటులో కూర్చున్నారు. ఎమ్మార్వో ఎక్కడున్నాడని సిబ్బందిని ప్రశ్నించారు.

నేను వస్తున్నానని చెప్పినా ఎక్కడికెళ్లారని సిబ్బందిని ప్రశ్నించారు. అయితే ఈ విషయమై ఎమ్మార్వో స్పందిస్తూ తనకు ఎమ్మెల్యే వస్తున్నట్లు సమాచారం ఇవ్వలేదని, అందుకే ఆ సమయంలో గ్రామసభలో పాల్గొన్నానని వెల్లడించారు.

ప్రీతిమీనా పట్ల అసభ్యంగా ప్రవర్తించినట్లు ఆరోపణలు ఎదుర్కొన్న ఎమ్మెల్యే శంకర్ నాయక్ తాజాగా ఈ వివాదంలో ఇరికిపోవడంతో ఉద్యోగ వర్గాల్లో చర్చనీయాంశమైంది.

PREV
click me!

Recommended Stories

Hyderabad లో ప్రస్తుతం కిలో టమాటా ధర ఎంత..?
Sankranti Weather : తెలుగోళ్ళకు గుడ్ న్యూస్.. సంక్రాంతి పండక్కి సరైన వెదర్