కెసిఆర్ ‘నాకొడుకులు’ భాషకు ఒక కమ్యూనిస్టు జవాబు

Published : Aug 03, 2017, 06:39 PM ISTUpdated : Mar 25, 2018, 11:46 PM IST
కెసిఆర్ ‘నాకొడుకులు’ భాషకు ఒక కమ్యూనిస్టు జవాబు

సారాంశం

తెలంగాణ సిఎం భాషపై కమ్యూనిస్టు కౌంటర్ నా కొడుకులు ఏడున్నరో చెప్పిన కమ్యూనిస్టు  

కమ్యునిస్టు నా కొడుకులు యాడున్నారా?
చెప్తా ....... ఆలకించు కెసీఆర్ సాబ్.

తరాల నుంచి మాయల ముంచి
మా తాతముత్తాల రక్తం మీరెట్ల 
కాజేస్తుంన్రో చెప్పిన కాడున్నరు ........

నా కొడుకులు ఏడున్నారా ?
ఆసాములు భూసాములు
మదమెక్కిన సామంతులు
మా అయ్య రెక్కల కష్టం
ఎట్ల మెక్కిరో చెప్పినకాడున్నరు.....

నా కొడుకులు యాడున్నారా 
గిరగిర తిరిగే మిల్లుల నడుమ
నడుములు నలిగిలా
నా యమ్మ శ్రమను
నీ తాతలెట్ల దోచుకున్నరో
తెలిపినకాడున్నరు.......

నా కొడుకులు యాడున్నారా
పీకలు కోస్తూ
గోతులు తీస్తూ
పిల్లాపాపలను సైతం
జాతి పేరున చంపుతున్న
నర హంతక నాజీ మూకలను మట్టుబెట్టిన కాడున్నరు

నా కొడుకులు యాడున్నారా
ఆడతల్లుల మానలలో
తొండలు దూర్చి
నా అక్కచెల్లెళ్ళ బట్టలూడదీసి బతుకమ్మ లాడించిన నా కొడుకు నిజాం పంచలూడదీసిన కాడున్నరు

(సోషల్ మీడియా నుంచి)

PREV
click me!

Recommended Stories

Rain Alert: హైద‌రాబాద్‌లో దంచికొట్టిన వ‌ర్షం.. ఈ ప్రాంతాల్లో మ‌రో 3 రోజులు వానలు
మియాపూర్‌ భూముల వ్య‌హారం ఏంటి? అస‌లు క‌థ ఎప్పుడు మొద‌లైంది? 550 ఎక‌రాలు ఏం చేయ‌నున్నారు?