ఖానామెట్ భూముల వేలం హోరాహోరీగా సాగింది. దాదాపుగా 60 మంది బిడ్డర్లు ఈ - ఆక్షన్‌లో పాల్గొన్నారు. హైటెక్ సిటీకి దగ్గరగా వుండటంతో ధర ఎక్కువ పలికినట్లుగా తెలుస్తోంది. ఎవరు ఏ ఫ్లాట్ దక్కించుకున్నారన్న విషయంపై ప్రభుత్వం అధికారిక ప్రకటన చేయనుంది.
ఖానామెట్ భూముల ఈ-ఆక్షన్ ముగిసింది. ఖానామెట్‌లోని 15 ఎకరాల్లోని ఐదు ఫ్లాట్లకు వేలం వేశారు. కోకాపేట్ కంటే ఖానామెట్ భూములు ఎక్కువ ధర పలికినట్లుగా తెలుస్తోంది. ఉదయం 9 గంటల నుంచి 5 గంటల వరకు వేలం జరిగింది. ఒక ఎకరం రూ.55 కోట్లకు పైగా ధర పలికినట్లుగా తెలుస్తోంది. యావరేజ్‌గా రూ.48.92 కోట్లు పలికినట్లు అధికారులు వెల్లడించారు.
నిన్న కోకాపేట్‌లో ఎనిమిది ఫ్లాట్లు వేలం వేశారు. ఇందుకు గాను ప్రభుత్వానికి రూ.2 వేల కోట్ల ఆదాయం వచ్చింది. ఈ రోజు జరిగిన వేలం కూడా హోరాహోరీగా సాగింది. దాదాపుగా 60 మంది బిడ్డర్లు ఈ - ఆక్షన్‌లో పాల్గొన్నారు. హైటెక్ సిటీకి దగ్గరగా వుండటంతో ధర ఎక్కువ పలికినట్లుగా తెలుస్తోంది. ఖానామెట్ భూముల విక్రయం ద్వారా ప్రభుత్వానికి రూ.729.41 కోట్ల ఆదాయం లభించింది.
Also Read:కోకాపేట్ భూముల వేలం: సర్కార్‌కి రూ.2 వేల కోట్లకు పైగా ఆదాయం, గరిష్ట ధర ఎంతంటే..?
కోకాపేట, ఖానామెట్ భూముల వేలంతో ప్రభుత్వానికి రూ.2,729 కోట్ల ఆదాయం సమకూరింది. మరోవైపు రూ.153.09 కోట్లతో 3.15 ఎకరాలను లింక్ వెల్ టెలీ సిస్టమ్స్, రూ.137.34 కోట్లతో 3.15 ఎకరాలను అప్‌టౌన్ లైఫ్ ప్రాజెక్ట్స్, రూ.189.98 కోట్లతో 3.69 ఎకరాలను జీవీపీఆర్ ఇంజినీర్స్, రూ.160.60 కోట్లతో 2.92 ఎకరాలను మంజీరా కన్‌స్ట్రక్షన్స్, రూ.92.40 కోట్లతో లింక్ వెల్ టెలీసిస్టమ్స్ 2 ఎకరాలు కొనుగోలు చేశాయి.