Crypto Currency : సూర్యాపేటలో ఖమ్మం వ్యాపారి ఆత్మహత్య, బయటపడుతున్న నకిలీ క్రిప్టో కరెన్సీ మూలాలు..

By AN TeluguFirst Published Nov 26, 2021, 10:42 AM IST
Highlights

సూర్యాపేట టౌన్‌లోని కొత్త బస్టాండ్‌ సమీపంలోని ఓ లాడ్జి వాష్‌రూమ్‌లో రామలింగ స్వామి(36) శవమై కనిపించాడు. అతను విషం తాగాడని తేలింది. రామలింగస్వామి ఖమ్మంలోని యెల్లందు నివాసి. అతని మృతదేహం వద్ద లభించిన సూసైడ్ నోట్ లో ఆన్‌లైన్‌లో పెట్టుబడులు, ఆర్థిక సమస్యలు, ఫైనాన్షియర్ వేధింపుల గురించి ప్రస్తావించినట్టు పోలీసులు గుర్తించారు.

హైదరాబాద్: ఆన్‌లైన్‌లో పెట్టుబడుల కోసం తీసుకున్న డబ్బును తిరిగి ఇవ్వాలని ఫైనాన్షియర్ లు వేధింపులకు గురిచేయడంతో ఓ వ్యాపారి మంగళవారం ఆత్మహత్య చేసుకున్న సంఘటన సూర్యాపేట జిల్లాలో జరిగింది. అయితే, ఈ ఆన్‌లైన్ నష్టాలు క్రిప్టో కరెన్సీ పెట్టుబడులతో ముడిపడి ఉన్నాయా అనే కోణంలో విచారణ జరుపుతున్నట్లు పోలీసులు తెలిపారు. సదరు వ్యాపారవేత్త ఇంతకుముందు పాఠశాలలను నడిపేవాడు.. కరోనా కారణంగా నష్టాలు రావడంతో వాటిని మూసేశాడు.

సూర్యాపేట టౌన్‌లోని కొత్త బస్టాండ్‌ సమీపంలోని ఓ లాడ్జి వాష్‌రూమ్‌లో రామలింగ స్వామి(36) శవమై కనిపించాడు. అతను విషం తాగాడని తేలింది. రామలింగస్వామి ఖమ్మంలోని యెల్లందు నివాసి. Ramalinga Swamy మృతదేహం వద్ద లభించిన సూసైడ్ నోట్ లో ఆన్‌లైన్‌లో పెట్టుబడులు, ఆర్థిక సమస్యలు, ఫైనాన్షియర్ వేధింపుల గురించి ప్రస్తావించినట్టు పోలీసులు గుర్తించారు.

“క్రిప్టో కరెన్సీలో తాను నష్టపోయానని Suicide note‌లో నేరుగా ప్రస్తావించలేదు. కానీ, అతను crypto currencyలో ఉన్నాడని అతని కుటుంబం పేర్కొంది, ”అని Suryapet టౌన్ పోలీసు చెప్పారు.అతని కుటుంబం సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం, కోవిడ్ వల్ల పాఠశాలవ్యాపారం దెబ్బతినడంతో.. స్వామి Crypto currencyలోకి దిగాడు. మొదట్లో లాభాలు రావడంతో కొంతమంది వ్యక్తుల నుండి రామలింగస్వామి లక్షల రూపాయలు అప్పుగా తీసుకుని దీంట్లో పెట్టాడు. కానీ నష్టాలు వచ్చాయని, అతని కుటుంబం పేర్కొంది.

“నా భర్త దాదాపు అందరి దగ్గర తీసుకున్న అప్పులు దాదాపుగా తిరిగి ఇచ్చేశాడు. అయితే, ఏపీలోని కృష్ణా జిల్లాలో ఓ గ్రామ సర్పంచ్‌ అయిన ఓ ఫైనాన్షియర్ డబ్బులు తిరిగి ఇవ్వాలని వేధిస్తున్నాడని స్వామి భార్య స్వాతి విలేకరులతో అన్నారు. ఇటీవల బాధితుడి నుంచి ఖాళీ చెక్కులు, బంగారంతో పాటు కారుపై కూడా ఆ ఫైనాన్షియర్ బలవంతంగా సంతకం తీసుకున్నాడని కుటుంబీకులు ఆరోపిస్తున్నారు.

సోమవారం ఉదయం 7.30 గంటలకు ఫైనాన్షియర్ బాకీలు తీర్చేందుకు హైదరాబాద్‌కు వెళ్తున్నట్లు భార్యకు చెప్పి స్వామి ఇంటి నుంచి వెళ్లిపోయాడు. ఆ తరువాత మధ్యాహ్నం 3 గంటల వరకు ఫోన్‌లో టచ్‌లో ఉన్నాడని, అయితే ఆ తర్వాత మొబైల్ స్విచ్ ఆఫ్ అయిందని అతని భార్య తెలిపింది. ఆ తర్వాత కుటుంబ సభ్యులు మిస్సింగ్‌ కేసును పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. 

హైదరాబాద్ శివారులో గుట్టుగా హైటెక్ వ్యభిచారం... రట్టుచేసిన పోలీసులు

కాగా, మంగళవారం అతని గదినుంచి ఎలాంటి స్పందన రాకపోవడంతో లాడ్జి నిర్వాహకులు బలవంతంగా తలుపులు తెరిచి చూడగా స్వామి బాత్‌రూమ్‌లో dead bodyగా కనిపించాడు. కాగా, ఆత్మహత్యకు కారణం అని ఆరోపణలు ఎదుర్కొంటున్న శివాపురం గ్రామ సర్పంచ్ తేల్ల లక్ష్మణరావు ప్రస్తుతం పరారీలో ఉన్నాడు. 

అయితే, రామలింగస్వామి ఆన్ లైన్ ట్రేడిం్ లో రూ. 70 లక్షలు పోగొట్టుకున్నట్టు తేలింది. online tradingలో క్రిప్టో యాప్ లో పెట్టుబడి పెట్టిన రామలింగస్వామి.. ఆన్లైన్ ట్రేడింగ్  బిజినెస్ లో రూ.70 లక్షలు పోగొట్టుకున్నారు. అయితే, ఏపీలో ఇలాంటి నకిలీ క్రిప్టో కరెన్సీ మూలాలు బయటపడుతున్నాయి. అధిక లాభం పొందేందుకు నకిలీ క్రిప్టో కరెన్సీ యాప్ లో జాయిన్ అయిన రామలింగస్వామి చివరికి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. 

ఈ ఘటనపై పోలీసులు విచారణ చేపట్టినకొద్దీ మరిన్ని నిజాలు బయటకు వస్తున్నాయి. మృతుడు విజయవాడకు చెందిన ఆనంద్ కిశోర్, నరేష్ తో కలిసి 
Fake crypto currency app లో పెట్టుబడి పెట్టాడు. అలాగే పార్ట్ నర్ లో కలిసి మరికొంత మందితో  మృతుడు  పెట్టుబడి పెట్టించినట్టు తెలిసింది. 

క్రిష్ణా జిల్లా జొన్నలగడ్డకు చెందిన బాబీతో రూ.70లక్షల వరకు పెట్టుబడి పెట్టించాడు స్వామి. ఇక నకిలీ యాప్ మూసి వేయడంతో నష్ట పోయామని పార్ట్ నర్లు, మధ్యవర్తులు వేధింపులు ప్రారంభిచారు. తన డబ్బులు రాబట్టేందుకు రామలింగస్వామి మీద కృష్ణా జిల్లా శివపురం సర్పంచ్ లక్ష్మీ నారాయణతో కలిసి బాబీ వేధింపులకు పాల్పడ్డారు. 

click me!