Road Accident: చెట్టును ఢీకొన్న కారు, నలుగురు కరీంనగర్ వాసుల మృతి (Video)

Published : Nov 26, 2021, 07:48 AM ISTUpdated : Nov 26, 2021, 08:59 AM IST
Road Accident: చెట్టును ఢీకొన్న కారు, నలుగురు కరీంనగర్ వాసుల మృతి (Video)

సారాంశం

కరీంనగర్ జిల్లాలోని మానకొండూరు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఖమ్మం నుంచి వస్తున్న కారు చెట్టును ఢీకొట్టడంతో ఈ ప్రమాదం సంభవించింది. ప్రమాదంలో నలుగురు మరణించారు.

కరీంనగర్: తెలంగాణలోని కరీంనగర్ జిల్లాలో ఘోరమైన రోడ్డు ప్రమాదం జరిగింది. ప్రమాదంలో నలుగురు మరణించారు. ఒక్కరు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడినవారి పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. కరీంనగర్ జిల్లా మానకొండూరు వద్ద ఈ Road accident చోటు చేసుకుంది.కారును చెట్టు ఢీకొనడంతో కారులో ఉన్న నలుగురు మరణించారు. మరొకరు గాయపడ్డారు. మృతులు Karimanagrలోని జ్యోతినగర్ వాసులు. ఖమ్మం నుండి కారులో తిరిగి వస్తుండగా ఆ ప్రమాదం జరిగింది.

శుక్రవారం తెల్లవారు జామున వేగంగా దూసుకొచ్చిన కారు అదుపు తప్పి మానకొండూరు పోలీసు స్టేషన్ సమీపంలో గల చెట్టును ఢీకొట్టింది. దాంతో కారులో ప్రయాణిస్తున్న నలుగురు దుర్మరణం పాలయ్యారు. ప్రమాదం గాయపడిన వ్యక్తిని కరీంనగర్ ఆస్పత్రికి తరలించారు. అతని పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. ఖమ్మం జిల్లాలోని కల్లూరులో దశ దినకర్మకు వెళ్లి వస్తుండగా ప్రమాదం జరిగింది. పోలీసులు కేసులు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

VIDEO

మృతులను శ్రీనివాసరావు, శ్రీరాజ్, కొప్పుల బాలాజీ, జలందర్ లుగా పోలీసులు గుర్తించారు. ప్రమాదం జరిగిన సమయంలో జలంధర్ కారును నడుపుతన్నాడు. డ్రైవర్ నిద్ర మత్తులో కారు నడపడం వల్లనే ప్రమాదం సంభవించినట్లు తెలుస్తోంది. నలుగురు కూడా అక్కడికక్కడే మరణించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు సిఐ కృష్ణా రెడ్డి తెలిపారు. గాయపడిన వ్యక్తిని గురుకుల సుధాకర్ రావుగా గుర్తించారు.

వివరాలు తెలియాల్సి ఉంది.

PREV
click me!

Recommended Stories

Sydney Bondi Beach ఉగ్రదాడి: నిందితుడు సాజిద్ అక్రమ్‌కు హైదరాబాద్ లింకులు.. భారత పాస్‌పోర్ట్‌తో షాకింగ్ !
Sankranti Holidays : ఉద్యోగులకూ పండగే.. ఈ సంక్రాంతికి వరుసగా తొమ్మిది రోజుల సెలవులు?