Asianet News TeluguAsianet News Telugu

హైదరాబాద్ శివారులో గుట్టుగా హైటెక్ వ్యభిచారం... రట్టుచేసిన పోలీసులు

హైదరాబాద్ శివారు పఠాన్ చెరు ప్రాంతంలో నిర్వహిస్తున్న రెండు వ్యభిచార గృహాలపై దాడిచేసిన పోలీసులు నలుగురు మహిళలు, మరో నలుగురు విటులను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. 

police attacks on Prostitution houses in patancheru hyderabad
Author
Hyderabad, First Published Nov 26, 2021, 10:00 AM IST
  • Facebook
  • Twitter
  • Whatsapp

హైదరాబాద్: తెలంగాణ రాజధాని హైదరాబాద్ శివారుప్రాంతాలు అసాంఘిక కార్యాకలాపాలకు అడ్డాగా మారాయి. సిటీతో పోలిస్తే పోలీస్ నిఘాతో పాటు జనసంచారం తక్కువగా వుండే శివారుప్రాంతాల్లో తమ గలీజ్ దందాను యధేచ్చగా సాగిస్తున్నాయి కొన్ని వ్యభిచార ముఠాలు. అడపాదడపా పోలీసులు దాడులు జరుపుతున్నా గుట్టుగా వ్యభిచారం కొనసాగుతూనే వుంది. 

తాజాగా పఠాన్ చెరు పరిధిలోని వ్యభిచార గృహాలపై పోలీసులు దాడులు నిర్వహించారు. patancheru పరిధిలోని అమీన్ పూర్ నరేంద్రకాలనీలో ఓ అపార్ట్ మెంట్ లో ప్లాట్ ను అద్దెకు తీసుకుని ఓ మహిళ prostitution నిర్వహిస్తున్న పోలీసులకు సమాచారం అందింది. దీంతో సదరు అపార్ట్ మెంట్ పై నిఘా వుంచిన పోలీసులు వ్యభిచారం జరుగుతున్నట్లు నిర్దారించుకున్నారు. దీంతో వెంటనే ప్లాట్ పై దాడిచేసి నిర్వహకురాలితో పాటు ఇద్దరు యువతులు, మరో ఇద్దరు విటులను అదుపులోకి తీసుకున్నారు. 

ఇక ఇదే అమీన్ పూర్ పరిధిలోని పటేల్ గూడ బిహెచ్ఈఎల్ కాలనీలో ఓ ఇంట్లో వ్యభిచార దందా సాగుతున్నట్లు పోలీసులు గుర్తించారు. ఆ ఇంటిపై దాడిచేసి విటుడితో పాటు యువతిని అదుపులోకి తీసుకున్నారు. 

read more  వ్యభిచార బ్రోకర్ల నుంచి రూ. లక్షల్లో లంచం.. ఇద్దరు పోలీసులపై ఫిర్యాదు.. చివరకు ఏం జరిగిందంటే..

ఇలా పట్టుబడిన brothal house నిర్వహకులతో పాటు విటులపై కేసు నమోదుచేసి రిమాండ్ కు తరలించినట్లు పటాన్ చెరు సీఐ శ్రీనివాసులు తెలిపారు. ఇక మహిళలను రెస్క్యూ హోంకు తరలించినట్లు వెల్లడించారు. 

ఐటీ ఉద్యోగులే టార్గెట్ గా పటాన్ చెరు, లింగంపల్లి ప్రాంతాలపై వ్యభిచార ముఠాలు కన్నేసినట్లు పోలీసులు చెబుతున్నారు. హైటెక్ పద్దతుల్లో IT Employees ను ఆకర్షిస్తూ వ్యభిచారం నిర్వహిస్తున్నారు. ఐటీ కారిడార్ అయిన హైటెక్ సిటీ, గచ్చిబౌలి ప్రాంతాలన అతి సమీపంలో వుండటం... ఐటీ ఉద్యోగులు ఎక్కువగా నివాసముండటం... శివారు ప్రాంతం కావడంతో పఠాన్ చెరు ప్రాంతంలో వ్యభిచార గృహాలు వెలుస్తున్నాయి.

read more  హైదరాబాద్ శివారులో ఆన్లైన్ వ్యభిచారం... గుట్టురట్టు చేసిన పోలీసులు

ఇదిలావుంటే ఇటీవల హైదరాబాద్ లో మసాజ్ ముసుగులో వ్యభిచారం నిర్వహిస్తున్న ఓ సెంటర్ మీద టాస్క్ ఫోర్స్ పోలీసులు దాడి చేశారు. మసాజ్ సెంటర్ నిర్వాహకులతో పాటు ఒక విటుడిని, పలువురు యువతులను అదుపులోకి తీసుకున్నారు. 

బంజారా హిల్స్ రోడ్ నంబర్ 12లో కొందరు ‘ఎలిగంట్ బ్యూటీ స్పాలూన్, అథర్వ హమామ్ స్పా’ పేర్లతో మసాజ్ సెంటర్ నిర్వహిస్తున్నారు. అయితే ఈ కేంద్రాల్లో మసాజ్ పేరిట Prostitution నిర్వహిస్తున్నట్లు సమాచారం అందుకున్న టాస్క్ ఫోర్స్ పోలీసులు దాడులు జరిపారు. ఈ క్రమంలో మసాజ్ సెంటర్ నిర్వాహకలుతో పాటు ఒక విటుడు, పలువురు యువతులను అదుపులోకి తీసుకున్నారు. అనంతరం కేసు నిమిత్తం బంజారాహిల్స్ పోలీసులకు నిందితులను అప్పగించారు. 

హైదరాబాద్ తో పాటు శివారు ప్రాంతాల్లో అశ్లీల కార్యకలాపాలు ఎక్కువగా సాగుతున్నాయి. రేవ్ పార్టీలతో పాటు వ్యభిచార దందా ఎక్కువగా శివారుల్లోనే  జరుగుతున్నాయి. దీంతో పోలీసులు హైాదరాబాద్ శివారు ప్రాంతాలపై నిఘా పెంచి అశ్లీల కార్యకలాపాలకు అడ్డుకట్ట వేస్తున్నారు. 
 

Follow Us:
Download App:
  • android
  • ios