కాంగ్రెస్ లోకి కేసీఆర్ సన్నిహితుడు కూచాడి శ్రీనివాసరావు.. బీఆర్ఎస్ కు బిగ్ షాక్..

Published : Jun 13, 2023, 10:03 AM IST
కాంగ్రెస్ లోకి కేసీఆర్ సన్నిహితుడు కూచాడి శ్రీనివాసరావు.. బీఆర్ఎస్ కు బిగ్ షాక్..

సారాంశం

సీఎం కేసీఆర్ కు అత్యంత సన్నిహితుడిగా పేరొందిన కూచాడి శ్రీనివాసరావు కాంగ్రెస్ లో చేరబోతున్నారు. బీఆర్ఎస్ కు రాజీనామా చేశారు. 

నిర్మల్ : ఉమ్మడి అదిలాబాద్ జిల్లాలో బీఆర్ఎస్ కు ఊహించని షాప్ తగిలింది. సీఎం కెసిఆర్ కు సన్నిహితుడు, తెలంగాణ ఉద్యమకారుడు కూచాడి శ్రీహరి రావు బీఆర్ఎస్ కు గుడ్ బై చెప్పారు. దీంతో బిఆర్ఎస్ పార్టీకి బిగ్ షాక్ తగిలినట్లైంది. త్వరలోనే కూచాడి శ్రీహరిరావు  కాంగ్రెస్ పార్టీలో చేరనున్నట్లు తెలుస్తోంది. ఆయన బి ఆర్ ఎస్ నుండి వైదొలగడానికి కారణాలు ఈ విధంగా తెలుస్తున్నాయి..  తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమంలో ముందుండి పోరాటం చేసినప్పటికీ.. తమకు రాష్ట్ర ఏర్పాటు తర్వాత ఎలాంటి గుర్తింపు లేకపోవడాన్ని నిరసిస్తూ ఆయన ఈ నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది.

అదిలాబాద్ జిల్లా జడ్పీ మాజీ ఫ్లోర్ లీడర్, టిఆర్ఎస్ పార్టీ ఉమ్మడి జిల్లా మాజీ అధ్యక్షుడు శ్రీహరిరావు. సోమవారం ఆయన ఈ నేపథ్యంలోనే  జిల్లా కేంద్రంలో తన అనుచరులతో కలిసి ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. ఈ సందర్భంగానే తాను బిఆర్ఎస్ కు రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ సమ్మేళనంలో ఆయన మాట్లాడుతూ.. రెండోసారి తెలంగాణలో అధికారంలోకి వచ్చిన టిఆర్ఎస్ ప్రజలను వంచిందని అన్నారు.

హైద్రాబాద్‌లో నకిలీ బయోమెట్రిక్‌తో పారిశుధ్య కార్మికుల వేతనాలు స్వాహా: ఇద్దరు అరెస్ట్

ఇకపై అలాంటి మోసాలు ఇష్టం లేకే పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు శ్రీహరి రావు తెలిపారు. ఈ మేరకు ఆయన ముఖ్యమంత్రి కేసీఆర్ కి తన రాజీనామా లేఖను సమర్పిస్తూ.. దాన్ని ఆమోదించాలని కోరారు. తెలంగాణను ఇచ్చింది సోనియాగాంధీ అని.. ప్రజలు ఆమెకి మద్దతు పలుకుతున్నట్లుగా చెప్పుకొచ్చారు. తెలంగాణలో ఈసారి కాంగ్రెస్ అధికారంలోకి రావాలని కోరుకుంటున్నట్లుగా తెలిపారు. జూన్ 17లోగా శ్రీహరి రావు కాంగ్రెస్ లోకి చేరేందుకు నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. 

తెలంగాణ రాకముందు 2007లో శ్రీహరి రావు టిఆర్ఎస్ లో చేరారు.  తెలంగాణ ఉద్యమ సమయంలో శ్రీహరి రావు కేసీఆర్ కు అత్యంత సన్నిహితుడుగా వ్యవహరించారు. బహిరంగ సభల్లో పాల్గొన్న ప్రతిసారి కెసిఆర్ శ్రీహరిరావుతో తనకున్న అనుబంధాన్ని పంచుకునేవారు. గతంలో బిజెపి నేతలు కూడా శ్రీహరి రావుతో చర్చలు జరిపినట్టుగా తెలుస్తోంది. కానీ ఆయన మాత్రం కాంగ్రెస్లో చేరేందుకే మొగ్గు చూపారు.

PREV
Read more Articles on
click me!

Recommended Stories

యశోద ఆసుపత్రికి కేసీఆర్ | KCR To Visit Peddi Sudarshan Reddy | Yashoda Hospital
పెద్ది సుదర్శన్ రెడ్డి ఫ్యామిలీని పరామర్శించిన కేసీఆర్ | KCR Meets Peddi Sudarshan Reddy Family