మాజీ ఎమ్మెల్యే కొత్తకోట దయాకర్ రెడ్డి కన్నుమూత..

Published : Jun 13, 2023, 06:27 AM ISTUpdated : Jun 13, 2023, 10:16 AM IST
మాజీ ఎమ్మెల్యే కొత్తకోట దయాకర్ రెడ్డి కన్నుమూత..

సారాంశం

మాజీ ఎమ్మెల్యే కొత్తకోట దయాకర్ రెడ్డి మంగళవారం ఉదయం హైదరాబాద్ లో కన్ను మూశారు.

హైదరాబాద్ : మాజీ ఎమ్మెల్యే కొత్తకోట దయాకర్ రెడ్డి కన్నుమూశారు. అనారోగ్యంతో హైదరాబాద్ లోని ఏఐజీ ఆస్పత్రిలోచికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. టీడీపీ నుంచి మూడు సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. రెండుసార్లు అమర చింత, ఒకసారి మక్తల్ నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు.

దయాకర్ రెడ్డి 1994, 1999లో టీడీపీ తరపున ఆమరచింత నియోజకవర్గం నుంచి రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఆ తర్వాత 2009లో మక్తల్ నుంచి టీడీపీ తరపున గెలిచారు. మొత్తం మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. దయాకర్‌రెడ్డి భార్య సీతమ్మ కూడా ఒకసారి ఎమ్మెల్యేగా గెలిచారు. 2002లో జిల్లా పరిషత్‌ చైర్‌పర్సన్‌గా ఎన్నికయ్యారు. 2009లో దేవరకద్ర నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు.

ఇదిలా ఉండగా, నిరుడు ఆగస్ట్ లో టిడిపికి రాజీనామా చేస్తానని ప్రకటిస్తూ మక్తల్ మాజీ ఎమ్మెల్యే కొత్తకోట దయాకర్రెడ్డి కంటతడి పెట్టుకున్నారు. తన పుట్టినరోజు సందర్భంగా మహబూబ్ నగర్ జిల్లా దేవరకద్రలో ఆయన సతీమణి, మాజీ ఎమ్మెల్యే సీతతో కలిసి టిడిపి కార్యకర్తల సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ తనకు కన్నతల్లి లాంటిది అన్నారు. రాజకీయ సమీకరణాల అనుగుణంగా  పార్టీ మార్పు తప్పనిసరిగా భావిస్తున్నట్లు తెలిపారు. త్వరలో కార్యకర్తలు సూచించిన పార్టీలో చేరతానని అన్నారు. 
 

 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

CM Revanth: ట్రాఫిక్ రూల్స్ బ్రేక్ చేస్తే చలాన్లు ఆటోమేటిక్‌గా ఖాతా నుంచి కట్ | Asianet News Telugu
విద్యార్థి దశలోనే రోడ్ సేఫ్టీ అవగాహన కల్పించాలి: Revanth Reddy on Road Safety | Asianet News Telugu