కేసీఆర్ కోలుకుంటున్నారని, త్వరలోనే జిల్లాల పర్యటన చేస్తారని మాజీ మంత్రి హరీశ్ రావు తెలిపారు. ఫిబ్రవరిలో తెలంగాణ భవన్‌కు వస్తారని, ప్రతి రోజు కార్యకర్తలను కలుస్తారని వివరించారు.
Harish Rao: అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్‌కు ఆరు నెలల గడువు ఇస్తామని, అప్పటి వరకు విమర్శలు చేయబోమని బీఆర్ఎస్ తొలుత పేర్కొంది. ఈ విషయాన్ని స్వయంగా కేసీఆరే చెప్పారు. ఓటమిని అంగీకరిస్తూ.. గెలిచిన కాంగ్రెస్ ప్రభుత్వానికి సహకరిస్తామని, ప్రభుత్వం కుదురుకోవడానికి సమయం ఇస్తామని, ఆరు నెలల వరకు దాడికి దిగబోమని చెప్పారు. కానీ, ఇప్పుడు సీన్ మారింది. పార్లమెంటు ఎన్నికలు సమీపిస్తుండటంతో బీఆర్ఎస్ దూకుడు పెంచింది. హరీశ్ రావు, కేటీఆర్‌లకు పరిమితం కాకుండా.. ఏకంగా కేసీఆరే రంగంలోకి దిగాలని నిర్ణయం తీసుకున్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే శ్వేతపత్రాలు, అవినీతి ఆరోపణలు, దర్యాప్తు ఆదేశాలతో బీఆర్ఎస్ పై అటాక్‌కు దిగింది. హరీశ్ రావు, కేటీఆర్, జగదీశ్ రెడ్డి సహా వారు చేసిన కామెంట్లు, ఆరోపణలు సెల్ఫ్ గోల్ అయ్యాయని విశ్లేషకులు చెబుతున్నారు. దీంతో పార్టీ డ్యామేజీ అవుతున్నదని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. ఇది ఇలాగే కొనసాగితే పార్లమెంటు ఎన్నికల్లో నష్టపోయే ముప్పు ఉన్నదని టాక్. అందుకే కేసీఆర్ రంగంలోకి దిగారని చర్చ జరుగుతున్నది.
Also Read : Ambati Rayudu: వైసీపీకి అంబటి రాయుడు గుడ్ బై చెప్పడంపై టీడీపీ రియాక్షన్ ఇదే
తాజాగా, పెద్దపల్లి జిల్లా కేంద్రంలో పార్లమెంటు నియోజకవర్గ సన్నాహక సమావేశంలో హరీశ్ రావు కీలక విషయాలు వెల్లడించారు. కేసీఆర్ కోలుకుంటున్నారని వివరించారు. త్వరలోనే ఆయన రాష్ట్రవ్యాప్తంగా జిల్లాల పర్యటన చేస్తారని చెప్పారు. అంతేకాదు, ఫిబ్రవరిలో ఆయనకు తెలంగాణ భవన్‌కు వస్తారని పేర్కొన్నారు. కార్యకర్తలకు అందుబాటులో ఉంటారని వివరించారు. ప్రతి రోజూ కార్యకర్తలను కలుస్తారని తెలిపారు.