కెసిఆర్ కు రేవంత్ కొత్త సవాల్

First Published Jun 29, 2017, 5:02 PM IST
Highlights

సిబిఐ కేసులకు భయపడే మీరు ఎన్డీఎకు ఉరికి ఉరికి మద్దతిస్తున్నారు. మీ ఇంట్లో ఆరు గంటల పాటు చెన్నై సిబిఐ అధికారులు రెండుసార్లు విచారణ జరిపిన మాట వాస్తవం. పూర్తి ఆధారాలతో నేను ఈ ఆరోపణలు చేస్తున్నాను. నిర్ధిష్టమైన సమాచారంతో చెబుతున్నా. మీకు దమ్ముంటే నామీద పరువునష్టం దావాలు వేసుకోండి. ఎదుర్కోవడానికి నేను సిద్ధం.

తెలంగాణ సిఎం కెసిఆర్ పై టిడిపి నేత రేవంత్ రెడ్డి మరో బాంబు పేల్చారు. సిబిఐ కేసులకు భయపడి సిఎం కెసిఆర్ తోకముడిచాడని ఆరోపించారు. అందుకోసమే అడగడక ముందే ఎన్డీఎ రాష్ట్రపతి  అభ్యర్థికి మద్దతు ఇచ్చాడని విమర్శించారు.

 

కెసిఆర్ కేంద్ర కార్మిక శాఖ మంత్రిగా ఉన్నప్పుడు సహారా గ్రూప్ పిఎఫ్ వివాదంలో చెన్నై నుంచి సిబిఐ అధికారులు కెసిఆర్ ఇంటికొచ్చి విచారణ జరిపినట్లు చెప్పారు. ఎలుగుబంటి సూర్యనారాయణ కేసులో కూడా సిబిఐ అధికారులు కెసిఆర్ ఇంటికొచ్చి 6 గంటలపాటు విచారించారన్నారు.  

 

కేసిర్ కార్మిక శాఖ మంత్రిగా ఉన్నప్పుడు సహారా గ్రూప్ పీఎఫ్ వివాదం తో పాటు, ఎలుగుబంటి సూర్యనారాయణ కేసులో రెండు సార్లు చెన్నయ్ నుండి సిబిఐ అధికారులు కెసిఆర్ ఇంటికొచ్చి ఆరు గంటల పాటు విచారణ జరిపారని ఆరోపించారు. ఆ కేసులకు భయపడే కేసీఆర్ కేంద్రానికి భజన చేస్తున్నాడని ఎద్దేవా చేశారు. అందుకే షరతులు విధించకుండా రాష్ట్రపతి  అభ్యర్ధికి మద్దతు ఇస్తున్నారని రేవంత్ విమర్శించారు.                        

 

సిబిఐ విచారణ జరిపిన విషయంలో తాను కచ్చితమైన ఆధారాలతో, నిర్ధిష్టమైన సమాచారంతో మాట్లాడుతున్నానని స్పష్టం చేశారు రేవంత్ రెడ్డి. కెసిఆర్ కు దమ్ముంటే  తన మీద పరువు నష్టం దావా వేయాలని సవాల్ చేశారు. మరి నిర్ధిష్టమైన ఈ సవాల్ ను అధికార పార్టీ ఎలా తీసుకుంటుందో చూడాలి. పరువునష్టం దావా వేస్తారా? లేక లైట్ తీసుకుంటారా అన్నది తేలాలి.

click me!