అక్బర్ కేసులో పహిల్వాన్ నిర్దోషి

Published : Jun 29, 2017, 04:01 PM ISTUpdated : Mar 25, 2018, 11:37 PM IST
అక్బర్ కేసులో పహిల్వాన్ నిర్దోషి

సారాంశం

ఎంఐఎం నేత అక్బరుద్దీన్ పై దాడి కేసులో నిందితుడిగా ఉన్న మహ్మద్ పహిల్వాన్ పై నాంపల్లి కోర్టు కేసును కొట్టేసింది. మొత్తం  14 మంది నిందితుల్లో నలుగురుకే శిక్ష ఖరారు చేసింది న్యాయస్థానం. పహిల్వాన్ తో పాటు మరో 9 మంది మీద ఎలాంటి ఆధారాలు లేకపోవడంతో కేసును కొట్టేసింది.

కేసులో ఉన్న ఎ2గా ఉన్న సలీమ్ బిన్, ఎ3గా ఉన్న అబ్దుల్లా యాఫై, ఎ5గా ఉన్న అవద్ యాఫై, ఎ12గా ఉన్న హసన్ బిన్ ఒమర్ యాఫై లకు మాత్రమే శిక్షను ఖరారు చేసింది. నలుగురు నిందితులకు పదేళ్ల పాటు జైలు శిక్ష విధిస్తూ కోర్టు తీర్పును వెలువరించింది.

ఎంఐఎం శాసనసభాపక్ష నేత అక్బరుద్దీన్ పై 2011లో హత్యాయత్నం జరిగింది.  ఈ కేసులో ఇప్పటి వరకు 14 మంది నిందితులపై పోలీసులు అభియోగాలు నమోదు చేశారు. 19 మంది సాక్ష్యులను విచారించింది.

నాంపల్లి కోర్టు. అలాగే అక్బరుద్దీన్ స్టేట్ మెంట్ కూడా రికార్డు చేశారు. దాడి జరిగిన 8 ఏళ్ల తర్వాత తీర్పు వెలువడింది.

PREV
click me!

Recommended Stories

Hyderabad లో ఏఐ డేటా సెంటర్.. ఈ ప్రాంతం మరో హైటెక్ సిటీ కావడం ఖాయం
Kavitha Kalvakuntla Pressmeet: రేవంత్ రెడ్డి, హరీష్ రావుపై రెచ్చిపోయిన కవిత| Asianet News Telugu