నాకంటే అదృష్టవంతుడు ఈ భూమి మీద లేడు

Published : Aug 10, 2017, 03:39 PM ISTUpdated : Mar 25, 2018, 11:41 PM IST
నాకంటే అదృష్టవంతుడు ఈ భూమి మీద లేడు

సారాంశం

నా కంటే గొప్ప అదృష్టవంతుడు భూమి మీద ఎవరూ లేరు. నా జన్మ ధన్యమైంది. నేను తెలంగాణ తెస్తనని చెప్పిన. తెచ్చిన

తెలంగాణ సిఎం కెసిఆర్ మరోసారి భావోద్వేగంతో మాట్లాడారు. శ్రీరాంసాగర్ పునరంకిత సభ లో ఆయన ప్రసంగిస్తున్నారు. మధ్యలో ఒకసారి పాత రోజులను యాదికి తెచ్చుకుని భావోద్వేగానికి లోనయ్యారు. తెలంగాణ ఉద్యమం, టిఆర్ఎస్ ఆవిర్భావం నాటి సంఘటనలను గుర్తుకు తెచ్చుకున్నారు.

ఈ సందర్భంగా కెసిఆర్ ఏమన్నారంటే... ‘‘నాకంటే గొప్ప అదృష్టవంతుడు ఈ భూమి మీద ఎవరూ లేరు. నేను తెలంగాణ ఉద్యమాన్ని ఆరంభిస్తానని ఇదే శ్రీరాం సాగర్ కట్టమీద మాట ఇచ్చిన. ఇచ్చిన మాట ప్రకారం పోరాటం చేసిన. తెలంగాణ సాధించిన. నేను గొప్ప అదృష్టవంతుడిని. నాకంటే అదృష్టవంతుడు ఈ భూమి మీద ఇంకెవరూ లేరు’’ అని కెసిఆర్ భావోద్వేగంతో మాట్లాడారు.

శ్రీరాంసాగర్ పునరంకిత సభ జరగుతుండగా ఎండ మండిపోయింది. దీంతో స్పందించిన కెసిఆర్ ఎండ బాగా ఉంది. ఇసిరి ఇసిరి కొడుతున్నది. ఇంకా చాలా మంది రాలేదు. చాలా మంది రోడ్ల మీద ఉన్నరు. బస్సులు వస్తున్నయి. అయినా నేను మీటింగ్ స్టార్ట్ చేశాను. ఇంకో 20 నిమిషాలు ఓపిక పట్టాలె. మీటింగ్ అయిపోగొడదాం అంటూ వ్యాఖ్యానించారు సిఎం.

PREV
click me!

Recommended Stories

Ration Card: ఇక‌ రేషన్ షాప్‌కి వెళ్లాల్సిన ప‌నిలేదు.. అందుబాటులోకి కొత్త మొబైల్ యాప్
Cold Wave: వ‌చ్చే 2 రోజులు జాగ్ర‌త్త‌, ఈ జిల్లాల‌కు ఆరెంజ్ అల‌ర్ట్‌.. స్కూల్‌ టైమింగ్స్‌లో మార్పులు