తెలంగాణలో కరోనా రాదు: కారణం చెప్పిన కేసీఆర్

By telugu teamFirst Published Mar 7, 2020, 4:02 PM IST
Highlights

తెలంగాణలో కరోనా వైరస్ రాదని చెబుతూ అందుకు గల కారణాన్ని సీఎం కేసీఆర్ శాసనసభలో చెప్పారు. కరోనా రావద్దని తాను దేవుడ్ని కోరుకుంటున్నట్లు తెలిపారు. గాంధీ ఆస్పత్రిలో పేషంట్ కోలుకుంటున్నట్లు తెలిపారు.

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో 30 డిగ్రీల ఉష్ణోగ్రత ఉందని, కరోనా వైరస్ రాదని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు అన్నారు. గవర్నర్ ప్రసంగానికి ధన్యావాదాలు తెలిపే తీర్మానానికి శాసనసభలో సమాధానం ఇస్తూ శనివారం ఆయన ఆ విధంగా ఉన్నారు. రాష్ట్రంలో కరోనా లేదని, అటువంటప్పుడు మాస్క్ లు ఎందుకని ఆయన అన్నారు. ఉష్ణోగ్రత 27 డిగ్రీలు దాటితే కరోనా రాదని ఆయన చెప్పారు.

తెలంగాణకు కరోనా వైరస్ రావద్దని దేవుడ్ని కోరుకుంటున్నట్లు కేసీఆర్ తెలిపారు. కరోనాయే లేనప్పుడు మాస్కులు లేకపోతే ఎవరూ చనిపోరని ఆయన అన్నారు. కరోనాపై అపోహలు వద్దని ఆయన అన్నారు. తెలంగాణలో కరోనా రాదు, రానివ్వమని ఆయన అన్నారు. కోట్లు రూపాయలు ఖర్చు చేసైనా సరే కరోనా వైరస్ రాకుండా చూస్తామని చెప్పారు. కరోనా వైరస్ సోకిన వ్యక్తి గాంధీ ఆస్పత్రిలో కోలుకుంటున్నట్లు ఆయన తెలిపారు. కరోనా మన రాష్ట్రంలో పుట్టలేదని, ఇది విదేశాల నుంచి వచ్చినవారి నుంచి వచ్చిందని ఆయన అన్నారు.

Also Read: ఇంట్లో పుట్టా, నా బర్త్ సర్టిఫికెట్ లేదు, నువ్వెవరంటే..: సీఏఏపై కేసీఆర్

ఇంటికో ఉద్యోగం ఇస్తామని తాము హామీ ఇవ్వలేదని, అసత్యాలు ప్రచారం చేయవద్దని కేసీఆర్ అన్నారు. 60 ఏళ్ల కాంగ్రెసు, టీడీపీల పాలనలో ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారో తేల్చడానికి చర్చ పెడుదామని ఆయన అన్నారు.దళితులకు మూడెకరాల భూమి ఇచ్చి తీరుతామని, మీ నియోజకవర్గాల్లో భూములు అమ్మేవాళ్లు ఉంటే చెప్పాలని, ఆ భూములను కొని దళితులకు ఇస్తామని ఆయన చెప్పారు.  కాంగ్రెసు, టీడీపీలు అధికారంలో ఉంటే మార్చి వస్తే బిందెల ప్రదర్శన ఉండేదని ఆయన అన్నారు. 

బిజెపి, కాంగ్రెసులు కూడా ఇతర పార్టీలకు చెందిన ఎమ్మెల్యేలను చేర్చుకున్నాయని ఆయన చెప్పారు. కాంగ్రెసు ఎమ్మెల్యేలు వస్తానంటే తాను నిరాకరించానని ఆయన చెప్పారు. చట్టబద్దంగా కాంగ్రెస్ ఎమ్మెల్యేలు టీఆర్ఎస్ లో విలీనమయ్యారని చెప్పారు. ప్రతిపక్షాలను ఎవరూ నిర్వీర్యం చేయడం లేదని, తమ పాలన నచ్చి వారంతటే వాళ్లే వస్తున్నారని ఆయన చెప్పారు.

Also Read: కేసీఆర్ ప్రసంగానికి ఆటంకం.. కాంగ్రెస్ సభ్యుల సస్పెన్షన్

click me!