పెద్ద నోట్ల రద్దు మీద కెసిఆర్ నిరసన ?

Published : Nov 11, 2016, 02:08 AM ISTUpdated : Mar 26, 2018, 12:00 AM IST
పెద్ద నోట్ల రద్దు మీద కెసిఆర్ నిరసన ?

సారాంశం

పెద్ద నోట్ల రద్దు  పేదల కొంపముంచడమే కాదు, తెలంగాణా ఖజానాను  కూడా ముంచుతూ ఉందని కెసిఆర్ గవర్నర్ కు చెప్పారు

ప్రధాని నరేంద్రమోడీ  తీసుకున్న పాత పెద్ద నోట్ల రద్దు మీద నిరసన వ్యక్తం చేసిన  మొట్టమొదటి ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు అయ్యారు. ఆయన రాజకీయాలు నడిపే తీరే వేరుగా వుంటుంది. హుందాగా, రాజ్యంగ బద్ధంగా,రాజ్ భవన్ కి నడిచారు. ఈ చర్య పేదల కొంపముంచడమే కాదు, తెలంగాణా కొంపను కూడా ముంచుతూ ఉందని ప్రాపర్ ఛానెల్ ద్వారా  స్పష్టంగా చెప్పారు.

 

పెద్దనోట్ల రద్దు ప్రభావం రాష్ట్రంపై భారీగా తీవ్రంగా ఉంటుందని సీఎం కేసీఆర్ గవర్నర్‌కు తెలిపారు.తెలంగాణా ఆదాయానికి బాగా పడిపోయిందని గత రెండురోజుల్లోనే రాష్ట్ర ఆదాయంలో 90 శాతం పడిపోయిందని, నెలకు రూ.1000 నుంచి రూ.2000 కోట్ల వరకు నష్టం వాటిల్లే అవకాశం ఉందని గవర్నర్ చెప్పారు.

 

మహబూబాబాద్ జిల్లా శనిగరంలో భూమి అమ్మి తెచ్చకున్న 55 లక్షలు చెల్లవని తెలుసుకున్న కందుకూ రి వినోద   అత్మహత్య చేసుకున్న విషప్రభావాన్ని కూడా ముఖ్యమంత్రి గవర్నర్ దృష్టికి తెచ్చారు.

 

సీఎస్ రాజీవ్‌శర్మ, సీఎంవో ముఖ్యకార్యదర్శి నర్సింగ్‌రావుతో కలిసి రాజ్‌భవన్‌కు వెళ్లి గవర్నర్‌తో భేటీ అయ్యారు. గంటన్నరకు పైగా సాగిన భేటీలో రూ.500, రూ.1000 నోట్ల రద్దు దుష్ప్రభావం గురించి ప్రధానంగా చర్చించినట్లు తెలిసింది.  ఈ సమావేశంలో గవర్నర్ దృష్టికి తెచ్చిన  అంశాలు:

 

రియల్ ఎస్టేట్ కుదేలైంది, రోజుకు మూడువేలకు పైగా లావాదేవీలు జరిగే రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో నోట్ల రద్దు తరువాత బుధవారం 150, గురువారం 300 రిజిస్ట్రేషన్లే జరిగాయి .సగటున నెలకు రూ.300-320 కోట్ల ఆదాయం వచ్చే పరిస్థితి లేదు.

 

రవాణరంగంపైనా తీవ్ర ప్రభావం పడింది. ఎక్కువగా నగదు లావాదేవీల ద్వారానే జరిగే చిన్న కార్ల క్రయవిక్రయాలపై ద్విచక్రవాహనాల క్రయవిక్రయాలుపడిపోయాయి. రోజుకు సగటున 3 వేల వాహనాల క్రయవిక్రయాలు జరిగేవి. బుధవారం 1700, గురువారం 1100 వాహనాలు మాత్రమే అమ్మకాలు జరిగి, ఆదాయం 50% పడిపోయిది. ఎక్సైజ్ ఆదాయం కూడా తగ్గే ప్రమాదం కనిపిస్తూ ఉంది.

 

 లగ్జరీ, గూడ్స్ తదితర అమ్మకాలుపడిపోయాయి.

 

రాష్ట్రంలో చిన్న వ్యాపారాలదే పెద్దవాటా. ఎక్కువ వ్యాపారాల్లో నగదు లావాదేవీలే జరుగుతాయి. నగదు ఛలామణిపై ఆంక్షలు విధించడంతో  ఈ వ్యాపారం కుదేలయింది.

 

 కేంద్ర పన్నుల్లో రాష్ర్టానికి రావాల్సిన వాటాను దేశచరిత్రలో మొదటిసారి తగ్గించారు. పన్నుల్లో తగిన వాటా ఇప్పించేందుకు గవర్నర్ కృషి చేయాలి.

 

PREV
click me!

Recommended Stories

అసెంబ్లీ సమావేశాలకు బయలుదేరిన కేసీఆర్ | KCR at Telangana Assembly Sessions | Asianet News Telugu
Top 5 Biryani Places : న్యూ ఇయర్ పార్టీకోసం అసలైన హైదరబాదీ బిర్యానీ కావాలా..? టాప్ 5 హోటల్స్ ఇవే