నరసింహన్ సేవలను వినియోగించుకోవాలని తెలంగాణ సీఎం కేసీఆర్ భావిస్తున్నారు. ఈ విషయమై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది.
హైదరాబాద్: తెలంగాణ గవర్నర్ గా పనిచేసిన నరసింహన్ సేవలను సీఎం కేసీఆర్ వినియోగించుకొనే యోచనలో ఉన్నాడని ప్రచారం సాగుతోంది. ఇదే విషయమై నరసింహన్ తో కేసీఆర్ చర్చించారనే ప్రచారం కూడ లేకపోలేదు. అయితే ఈ విషయమై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది.
తెలంగాణ గవర్నర్ గా ఉన్న నరసింహన్ ను బదిలీ చేశారు. కొత్త గవర్నర్ గా తమిళిసై సౌందర రాజన్‌ను నియమిస్తూ రాష్ట్రపతి ఆదివారం నాడు ఉత్తర్వులు జారీ చేశారు. నరసింహన్ కు ఇంకా ఎక్కడా కూడ బాధ్యతలు ఇవ్వలేదు.
తెలంగాణ ఉద్యమం సాగుతున్న సమయంలో కూడ ఉమ్మడి ఏపీ రాష్ట్రానికి నరసింహన్ గవర్నర్‌గా ఉన్నాడు. రాష్ట్రం విభజన సమయం తర్వాత కూడ రెండు తెలుగు రాష్ట్రాలకు కూడ నరసింహన్ గవర్నర్ గా కొనసాగారు.
తెలంగాణ రాష్ట్రానికి తొలిసారిగా కేసీఆర్ సీఎం అయ్యాక గవర్నర్ నరసింహన్ తో మంచి సంబంధాలు ఉన్నాయి. రెండో టర్మ్ లో కూడ ఇదే సంబంధాలను కేసీఆర్ గవర్నర్ నరసింహన్ తో కొనసాగించారు.
రాష్ట్రానికి సుదీర్ఘ కాలం పాటు సేవ చేసిన అనుభవం ఉన్నందున నరసింహన్ సేవలను ఉపయోగించుకోవాలని కేసీఆర్ భావిస్తున్నారని సమాచారం. నరసింహన్ తన బాధ్యతల నుండి తప్పుకొన్న తర్వాత రాష్ట్ర ప్రభుత్వ సలహదారుడిగా నియమించుకోవాలని కేసీఆర్ భావిస్తున్నారని సమాచారం.
ఇప్పటికే తొలి తెలంగాణ రాష్ట్రానికి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా పనిచేసిన రాజీవ్ శర్మను రాష్ట్ర ప్రభుత్వ సలహదారుడిగా కేసీఆర్ నియమించుకొన్నారు. ఆ తర్వాత డీజీపీగా పని చేసిన అనురాగ్ శర్మ ను కూడ కేసీఆర్ సలహదారుడిగా నియమంచుకొన్నారు.
తెలంగాణ రాష్ట్రానికి 9 ఏళ్ల 9 మాసాల పాటు గవర్నర్ గా పనిచేశారు. నరసింహన్ సేవలను ఉపయోగించుకోవాలని కేసీఆర్ భావిస్తున్నట్టుగా ప్రచారం సాగుతోంది. నరసింహన్ బదిలీ అయినట్టుగా వార్తలు రాగానే సీఎం కేసీఆర్ ఆదివారం నాడు గవర్నర్ నరసింహన్ తో రెండు గంటల పాటు సమావేశమయ్యారు.రెండు గంటల పాటు సీఎం కేసీఆర్ గవర్నర్ తో జరిపిన సమావేశం మర్యాదపూర్వకమైన సమావేశంగానే సీఎంఓ వర్గాలు చెబుతున్నాయి.
రెండు రాష్ట్రాలపై నరసింహన్ కు మంచి పట్టుంది. సుదీర్ఘ కాలం పాటు గవర్నర్ గా పనిచేశాడు. ఈ అనుభవాన్ని వినియోగించుకొంటే ప్రయోజనం ఉంటుందని కేసీఆర్ భావిస్తున్నారని సమాచారం. అయితే ఈ విషయమై ఇంకా స్పస్టత రావాల్సి ఉంది.
సంబంధిత వార్తలు
హిమాచల్‌ప్రదేశ్ గవర్నర్‌గా నియామకం: స్పందించిన దత్తాత్రేయ
విలువలు, క్రమశిక్షణ, విధేయత: దత్తన్న రాజకీయ ప్రస్థానం
తెలంగాణ గవర్నర్ నరసింహాన్ బదిలీ?
నరసింహన్ బదిలీ: తెలంగాణకు సౌందర రాజన్, హిమాచల్‌కు దత్తన్న
ప్రత్యక్ష ఎన్నికల్లో కలిసిరాని విజయం... వరించిన గవర్నర్ గిరి
దత్తాత్రేయకు బీజేపీ కార్యకర్తల అభినందనలు (ఫోటోలు)