భార్యను కాపురానికి పంపడం లేదని... అత్తను చంపిన అల్లుడు

Published : Sep 02, 2019, 01:19 PM ISTUpdated : Sep 02, 2019, 01:25 PM IST
భార్యను కాపురానికి పంపడం లేదని... అత్తను చంపిన అల్లుడు

సారాంశం

లలిత భర్త అఖిల్.. మేళ్లచెర్వు మండల కేంద్రంలోని ఓ బైక్ సర్వీసింగ్ పాయింట్ లో వర్కర్ గా పనిచేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. కాగా.. లలిత ఇటీవల పుట్టింటికి వచ్చింది. కాపురానికి రావాలని భర్త కొన్ని రోజులుగా అడుగుతున్నా పట్టించుకోలేదు. దీంతో అత్త కాశమ్మకు ఫోన్ చేసి భార్యను పంపించమని అడిగాడు.


భార్యను కాపురానికి పంపించమని అడిగినా... పంపించడం లేదని ఓ అల్లుడు తన అత్తపై కక్ష పెంచుకున్నాడు. కావాలనే తమ భార్యభర్తలను ఆమె విడదీస్తోందని అంటూ... ఆమెను అతి దారుణంగా హత్య చేశాడు. ఈ సంఘటన నల్గొండ జిల్లాలో చోటుచేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళితే...

హుజూర్‌నగర్‌ మండలం  వేపలసింగారం గ్రామపంచాయతీ పరిధి మిట్టగూడెం గ్రామానికి చెందిన  నాశబోయిన వెంకన్న, కాశమ్మ (46) దంపతులకు ముగ్గురు కుమార్తెలు. కూలి పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. కొన్నేళ్ల క్రితం వెంకన్న అనారోగ్య కారణాలతో మృతిచెందాడు. అప్పటినుంచి కుటుంబ భారం కాశమ్మపైనే పడింది. కూలీ పనులు చేస్తూనే ముగ్గురు కూతుళ్ల పెళ్లిళ్లు చేసింది.

కాగా.. మూడో కూతురు లలిత భర్త అఖిల్.. మేళ్లచెర్వు మండల కేంద్రంలోని ఓ బైక్ సర్వీసింగ్ పాయింట్ లో వర్కర్ గా పనిచేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. కాగా.. లలిత ఇటీవల పుట్టింటికి వచ్చింది. కాపురానికి రావాలని భర్త కొన్ని రోజులుగా అడుగుతున్నా పట్టించుకోలేదు. దీంతో అత్త కాశమ్మకు ఫోన్ చేసి భార్యను పంపించమని అడిగాడు.

ఆమెకూడా పంపించలేదు. దీంతో... తమ భార్యభర్తలను అత్త వేరు చేస్తోందని కోపం పెంచుకున్నాడు. తీవ్ర ఆగ్రహానికి లోనైనా అఖిల్‌ శనివారం రాత్రి పది గంటల సమయంలో అత్తగారి ఊరైన మిట్టగూడేనికి చేరుకున్నాడు. అప్పుడే నిద్రపోయిన అత్తతో తన భార్యను కాపురానికి పంపించాలని వాగ్వాదానికి దిగాడు. అందుకు ఆమె నిరాకరించడంతో ఘర్షణపడ్డాడు. అనంతరం పథకం ప్రకారం తన వెంట తెచ్చుకున్న కత్తితో అత్త కాశమ్మపై విచక్షణారహితంగా దాడి చేసి పరారయ్యాడు. 

తీవ్రగాయాలపాలైన ఆమెను ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలోనే ఆమె కన్నుమూసింది. లలిత ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. 

PREV
click me!

Recommended Stories

Constable Recruitment 2025 : 48954 పోలీస్ జాబ్స్.. తెలుగులోనే పరీక్ష, తెలుగు రాష్ట్రాల్లోనే ఎగ్జామ్ సెంటర్
Hyderabad: యువ‌త త‌ల రాత మార్చేలా.. హైద‌రాబాద్‌లో గూగుల్ తొలి స్టార్ట‌ప్స్ హ‌బ్, దీని ఉప‌యోగం ఏంటంటే