శాసనమండలి ఛైర్మెన్ గా సుఖేందర్ రెడ్డి: జూపల్లి, నాయినిలకు పదవులు

By narsimha lodeFirst Published Sep 8, 2019, 8:03 AM IST
Highlights

తెలంగాణ శాసనమండలి ఛైర్మెన్ పదవికి సుఖేందర్ రెడ్డిని నియమించాలని కేసీఆర్ ప్లాన్ చేసినట్టుగా సమాచారం.

హైదరాబాద్: మాజీ ఎంపీ గుత్తా సుఖేందర్ రెడ్డికి శాసనమండలి ఛైర్మెన్ పదవిని కట్టబెట్టేందుకు కేసీఆర్ నిర్ణయం తీసుకొన్నట్టుగా సమాచారం. శాసనమండలి ఛైర్మెన్ పదవికి శనివారం నాడే నోటిఫికేషన్ జారీ అయింది.గత ఎన్నికల్లో ఓటమి పాలైన టీఆర్ఎస్ సీనియర్లకు కేసీఆర్ కీలక పదవులను కట్టబెట్టే అవకాశం ఉంది. 

ఆదివారం నాడు కేసీఆర్ మంత్రివర్గాన్ని విస్తరించనున్నారు. ఆరుగురికి మంత్రివర్గంలో ఛాన్స్ కల్పించనున్నారు. మరికొందరికి కూడ కేసీఆర్ పదవులను కట్టబెట్టనున్నారు. పాత, కొత్త వారికి పదవుల్లో ప్రాధాన్యత ఇచ్చారు.అసెంబ్లీ సమావేశాలకు రెండు రోజుల ముందే చీఫ్ విప్, విప్ లను నియమిస్తూ కేసీఆర్ నిర్ణయం తీసుకొన్నారు. 

మాజీ ఎంపీ గుత్తా సుఖేందర్ రెడ్డిని శాసనమండలి ఛైర్మెన్ గా నియమించాలని కేసీఆర్ భావిస్తున్నారని సమాచారం. ఇటీవలనే సుఖేందర్ రెడ్డి ఎమ్మెల్సీగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.

సుఖేందర్ రెడ్డికి మంత్రి పదవి దక్కుతోందని అంతా భావించారు. కానీ, ఆయనను మంత్రివర్గంలోకి తీసుకోకుండా శాసనమండలి ఛైర్మెన్ పదవిని కట్టబెట్టే యోచనలో కేసీఆర్ ఉన్నట్టుగా కన్పిస్తోంది. శినవారం నాడే శాసనమండలి ఛైర్మెన్ ఎన్నికకు నోటిఫికేషన్ జారీ అయింది.

గతంలో శాసనమండలి చైర్మెన్ గా పనిచేసిన స్వామి గౌడ్ పదవి కాలం పూర్తైంది. ఆయనకు ఎమ్మెల్సీగా కొనసాగించలేదు. దీంతో సుఖేందర్ రెడ్డిని ఈ పదవిని కట్టబెట్టాలని కేసీఆర్ భావిస్తున్నారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

ఇక మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు, మాజీ స్పీకర్ మధుసూధనాచారి, మాజీ మంత్రి నాయిని నర్సింహ్మరెడ్డిలకు కూడ నామినేటేడ్ పోస్టులు దక్కే అవకాశం ఉంది. గత ఎన్నికల్లో జూపల్లి కృష్ణారావు, మధుసూధనాచారిలు ఓటమి పాలయ్యారు. గత ఎన్నికల్లో కూడ నాయిని నర్సింహ్మరెడ్డి పోటీ చేయలేదు. ముషీరాబాద్ నుండి తన అల్లుడికి టిక్కెట్టు ఇవ్వాలని కోరినా కూడ కేసీఆర్ టిక్కెట్టు ఇవ్వలేదు.

టీఆర్ఎస్ ఆవిర్భావం నుండి నాయిని నర్సింహ్మరెడ్డి కేసీఆర్ వెంటే ఉన్నారు. ఈ తరుణంలో నాయిని నర్సింహ్మరెడ్డికి ఆర్టీసీ ఛైర్మెన్ లేదా మరో నామినేటేడ్ పదవిని కట్టబెట్టాలని భావిస్తున్నారని సమాచారం.

సంబంధిత వార్తలు

నేడే మంత్రివర్గ విస్తరణ: ఆ ఆరుగురు వీరే....

కేసీఆఆర్ మంత్రివర్గ విస్తరణకు ముహూర్తం ఖరారు: కొత్తగా నలుగురే

కేసీఆర్ కేబినెట్: కేటీఆర్, హరీష్‌లలో ఎవరికి చోటు?

దసరా తర్వాత కేసీఆర్ కేబినెట్ విస్తరణ: హరీష్‌‌కు చోటు, కారణమదేనా

సుఖేందర్ రెడ్డికి కేసీఆర్ బంపర్ ఆఫర్ ఇదే....

click me!