కేసీఆఆర్ మంత్రివర్గ విస్తరణకు ముహూర్తం ఖరారు: కొత్తగా ఆరుగురు

By telugu team  |  First Published Sep 7, 2019, 10:25 PM IST

కేసీఆర్ మంత్రివర్గ విస్తరణకు ముహూర్తం ఖరారైంది. కొత్త గవర్నర్ తమిళసై సౌందర రాజన్ కొత్త మంత్రులతో రేపు సాయంత్రం 4 గంటలకు ప్రమాణ స్వీకారం చేయించనున్నారు. ఉద్వాసనలు ఉంటాయా అనే సందేహం తలెత్తుతోంది.


హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు మంత్రివర్గ విస్తరణకు ముహూర్తం ఖరారైంది. రేపు ఆదివారం సాయంత్రం 4 గంటలకు కొత్త మంత్రులు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ విషయాన్ని కెసిఆర్ నూతన గవర్నర్ తమిళసై సౌందర రాజన్ కు తెలియజేశారు. మంత్రి వర్గ విస్తరణకు ఏర్పాట్లు చేయాలని కేసీఆర్ సిఎస్ జోషీని ఆదేశించారు. 

తెలంగాణ నూతన గవర్నర్ గా తమిళసై సౌందర రాజన్ రేపు ఉదయం ప్రమాణ స్వీకారం చేయనున్నారు. మంత్రివర్గ విస్తరణకు ఏర్పాట్లు చేయాల్సిందిగా కేసీఆర్ ఆమెను కోరారు. ప్రస్తుతం కేసీఆర్ మంత్రివర్గంలో ఆరు ఖాళీలు ఉన్నాయి. అయితే, ఆరుగురితో కేసీఆర్ మంత్రివర్గ విస్తరణ ఉంటుందని సమాచారం. కేసీఆ రేపు ఆదివారం దశమి మంచి రోజు కావడంతో మంత్రివర్గ విస్తరణ చేయాలని కేసీఆర్ నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది.

Latest Videos

undefined

కేసీఆర్ మంత్రివర్గంలో మహిళలకు ప్రాతినిధ్యం లేదు. విస్తరణలో మహిళా మంత్రిగా సబితా ఇంద్రారెడ్డి ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఒకరు లేదా ఇద్దరు మంత్రులకు ఉద్వాసన పలికే అవకాశాలున్నట్లు వార్తలు వస్తున్నాయి. అయితే, తాజా పరిణామాల నేపథ్యంలో ఉద్వాసనలు ఉండకపోవచ్చునని అంటున్నారు. అయితే, ఒకరు లేదా ఇద్దరు మంత్రులకు ఉద్వాసన ఉంటుందని కొన్ని తెలుగు టీవీ చానెళ్లలో వార్తలు వస్తున్నాయి.

మంత్రివర్గ విస్తరణ తీరుతెన్నులపై రేపు ఆదివారం మధ్యాహ్నానికి స్పష్టత రావచ్చునని భావిస్తున్నారు. మంత్రివర్గ విస్తరణకు ముందు ఆయన శాసనసభ, శాసన మండలి చీఫ్ విప్, విప్ పదవులను ఖరారు చేశారు. తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) వర్కింగ్ ప్రెసిడెంట్, కేసీఆర్ తనయుడు కేటీ రామారావుకు మంత్రి పదవి లభించవచ్చునని చాలా కాలంగా ఊహాగానాలు చెలరేగుతున్నాయి. హరీశ్ రావును మంత్రివర్గంలోకి తీసుకుంటారా, లేదా అనేది తెలియదు. 

కాగా, 12 మంది ఎమ్మెల్యేలను కార్పోరేషన్ చైర్మన్లుగా నియమించాలని కేసీఆర్ నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఎన్నికల్లో ఓటమి పాలైన మధుసూదనాచారి, జూపల్లి కృష్ణా రావులకు కూడా కార్పోరేషన్ల చైర్మన్ పదవులు దక్కే అవకాశం ఉంది. ఎమ్మెల్సీలు కడియం శ్రీహరి, నాయని నర్సింహా రెడ్డి, ఎమ్మెల్యేలు పద్మాదేవేందర్ రెడ్డి, బాజిరెడ్డి గోవర్ధన్ లకు ఉన్నత పదవులు ఇవ్వాలని కేసీఆర్ అనుకుంటున్నారు.

 

click me!