పీవీకి భారతరత్న ఇవ్వాలి: అసెంబ్లీలో తీర్మానం పెట్టిన కేసీఆర్

By narsimha lodeFirst Published Sep 8, 2020, 11:25 AM IST
Highlights

మాజీ ప్రధాని పీవీ నరసింహారావుకు భారతరత్న ఇవ్వాలని తెలంగాణ సీఎం కేసీఆర్ డిమాండ్ చేశారు. ఈ మేరకు అసెంబ్లీలో తీర్మానాన్ని కేసీఆర్ ప్రవేశపెట్టారు.
 

హైదరాబాద్:మాజీ ప్రధాని పీవీ నరసింహారావుకు భారతరత్న ఇవ్వాలని తెలంగాణ సీఎం కేసీఆర్ డిమాండ్ చేశారు. ఈ మేరకు అసెంబ్లీలో తీర్మానాన్ని కేసీఆర్ ప్రవేశపెట్టారు.

మాజీ ప్రధాని పీవీ నరసింహారావుకు దక్కాల్సిన గౌరవం దక్కలేదన్నారు. పీవీ తెలంగాణ ముద్దుబిడ్డ అని ఆయన పునరుద్ఘాటించారు. మంగళవారం నాడు రెండో రోజు తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి.ఈ సమావేశాల్లో పీవీ శతజయంతి ఉత్సవాలపై సీఎం కేసీఆర్ చర్చను ప్రారంభించారు.

శత జయంతి ఉత్సవాల ద్వారా పీవీ దేశానికి చేసిన సేవలను స్మరించుకొందామన్నారు. పీవీ ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన సమయంలో దేశం సమస్యల సుడిగుండంలో ఉన్న విషయాన్ని ఆయన గుర్తు చేశారు. 

పంజాబులో వేర్పాటువాదం, కాశ్మీర్ లో ఉగ్రవాదం బుసలు కొట్టే సమయంలో ప్రధానిగా పీవీ నరసింహారావు  బాధ్యతలు చేపట్టారని ఆయన ఈ సందర్భంగా ప్రస్తావించారు.పీవీ ప్రారంభించిన సంస్కరణల ఫలితాలను ఈనాడు మనం అనుభవిస్తున్నామని కేసీఆర్ చెప్పారు.

also read:దుబ్బాకలో లక్ష మెజారిటీ, జీహెచ్ఎంసీలో మరోసారి ఘన విజయం: తేల్చేసిన సర్వే

మైనార్టీ ప్రభుత్వాన్ని సమర్ధవంతగా పీవీ నడిపినట్టుగా ఆయన చెప్పారు. ప్రణబ్ ముఖర్జీని ఆర్ధిక మంత్రిని చేసిన ఘనత పీవీదేనని ఆయన చెప్పారు.
దేశ ఆర్దిక వ్యవస్థను పటిష్టం చేసిన ఘనత పీవీదేనని ఆయన తెలిపారు. గ్లోబల్ ఇండియాకు పీవీ రూపకర్త అని ఆయన కొనియాడారు.

వచ్చే పార్లమెంట్ సమావేశాల్లో పీవీకి భారతరత్న ఇవ్వాలని కోరుతూ తెలంగాణ అసెంబ్లీలో తీర్మానాన్ని సీఎం కేసీఆర్ ప్రవేశ పెట్టారు. పార్లమెంట్ ప్రాంగణంలో పీవీ నరసింహారావు చిత్రపటం ఏర్పాటు చేయాలని ఆయన కోరారు. తెలంగాణ అసెంబ్లీలో పీవీ నరసింహారావు ఫోటోను కూడ పెట్టాలని కోరారు.

click me!