హైద్రాబాద్ జాతీయ పోలీస్ అకాడమీలో కరోనా కలకలం: 80 మందికి కోవిడ్

By narsimha lode  |  First Published Sep 8, 2020, 11:05 AM IST

 హైద్రాబాద్ సమీపంలో ఉన్న జాతీయ పోలీస్ అకాడమీలో 80 మంది కరోనా సోకింది. దీంతో అధికారులు జాగ్రత్తలు తీసుకొన్నారు.నాలుగు రోజుల క్రితమే సర్ధార్ వల్లభాయ్ పటేల్ జాతీయ పోలీస్ అకాడమీలో శిక్షణ పూర్తి చేసిన ఐపీఎస్ అధికారులకు ఔటింగ్ పేరేడ్ నిర్వహించారు. 



హైదరాబాద్: హైద్రాబాద్ సమీపంలో ఉన్న జాతీయ పోలీస్ అకాడమీలో 80 మంది కరోనా సోకింది. దీంతో అధికారులు జాగ్రత్తలు తీసుకొన్నారు.నాలుగు రోజుల క్రితమే సర్ధార్ వల్లభాయ్ పటేల్ జాతీయ పోలీస్ అకాడమీలో శిక్షణ పూర్తి చేసిన ఐపీఎస్ అధికారులకు ఔటింగ్ పేరేడ్ నిర్వహించారు. 

వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రధాని నరేంద్ర మోడీ శిక్షణ పూర్తి చేసిన  ఐపీఎస్ లతో ఆయన మాట్లాడారు.జాతీయ పోలీస్ అకాడమీలో పనిచేస్తున్న నాన్ గెజిటింగ్, ఆడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ కు కరోనా సోకింది.

Latest Videos

undefined

also read:కరోనాను జయించిన 102 ఏళ్ల బామ్మ: సీక్రెట్ ఇదీ....

కరోనా సోకిన 80 మంది సిబ్బందిని వేర్వేరు ప్రాంతాల్లో క్వారంటైన్ చేశారు అధికారులు.ఇంతకుముందు కరోనా సోకిన 25 నుండి 30 మంది కరోనా బారినపడ్డారు. వీరంతా కూడ త్వరలోనే కోలుకొన్నారని జాతీయ పోలీస్ అకాడమీ అధికారులు ప్రకటించారు.

కరోనా సోకిన సిబ్బంది ఎవరూ కూడ శిక్షణ విధుల్లో పాల్గొనలేదని పోలీస్ అకాడమీ అధికారులు తెలిపారు.పోలీస్ అకాడమీలోకి ఇతరులను అననుమతించడం లేదు. ట్రైనింగ్ పొందుతున్న వారికి శిక్షణ ఇచ్చే ఫ్యాకల్టీకి ఇంతవరకు కరోనా సోకలేదని అధికారులు స్పష్టం చేశారు.

click me!