టీకాంగ్రెస్‌లో ‘సీఎం సీటు’పై రగడ.. సీతక్క సీఎం వ్యాఖ్యలతో దుమారం

Published : Jul 11, 2023, 02:34 PM IST
టీకాంగ్రెస్‌లో ‘సీఎం సీటు’పై రగడ.. సీతక్క సీఎం వ్యాఖ్యలతో దుమారం

సారాంశం

తెలంగాణ కాంగ్రెస్‌లో సీఎం సీటు రగడ మొదలైంది. అవసరమైతే సీఎంగా సీతక్కనే అవుతారేమో అంటూ రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు చేయడం దుమారం రేపింది. ఈ వ్యాఖ్యలు అధిష్టానం దృష్టికి వెళ్లడంతో సీఎం సీటుపై కామెంట్స్ చేయవద్దని వార్నింగ్‌లు వచ్చాయి.  

హైదరాబాద్: తెలంగాణ కాంగ్రెస్‌లో సీఎం సీటు కేంద్రంగా రగడ మొదలైంది. పార్టీ కొంత పుంజుకోగానే సీఎం సీటు పై చర్చలు మొదలు కావడం గమనార్హం. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఈ అంశంపై చేసిన వ్యాఖ్యలకే ఈ చర్చకు ఆజ్యం పోశాయి. సీతక్క సీఎం అవుతుందనే వ్యాఖ్యలు కాంగ్రెస్ అధిష్టానానికీ చేరాయి. ఇప్పటికే పార్టీలో అంతర్గతంగా సీఎం క్యాండిడేట్ తామేనంటూ కొందరు యాక్షన్ ప్లాన్ వేసుకున్నారు. సీఎం బరిలో ఉన్నట్టూ కొందరు వ్యవహరిస్తున్నారు. సీఎం సీటు రేసులో రేవంత్ రెడ్డితోపాటు పీపుల్స్ మార్చ్ పాదయాత్ర విజయవంతంగా నిర్వహించి రాహుల్ గాంధీతో ప్రశంసలు పొందిన మల్లు భట్టి విక్రమార్క, సీనియర్ లీడర్ జానారెడ్డి పేర్లు ప్రముఖంగా వినిపించాయి. తాజాగా ఈ లిస్టులో ములుగు ఎమ్మెల్యే సీతక్క కూడా చేరింది.

రేవంత్ రెడ్డి అమెరికా పర్టనలో ఉన్నారు. ఇండియన్ ఓవర్సీస్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో అమెరికాలో మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. గిరిజిన మహిళగా సీతక్క ముఖ్యమంత్రి అయ్యే అవకాశాలు లేకపోలేదని చెప్పారు. ఈ వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో, సామాన్య ప్రజల్లోనూ చర్చను లేవదీశాయి. సోషల్ మీడియాలోనూ ఈ అంశం చుట్టూ వాదోపవాదాలు జరిగాయి.

అమెరికాలో ఎన్ఆర్ఐల ప్రశ్నలకు రేవంత్ రెడ్డి సమాధానాలు ఇచ్చారు. కాంగ్రెస్ పార్టీ వైఖరి ఎస్సీ, ఎస్టీల పట్లా ఎలా ఉంటుందని ఓ వ్యక్తి అడిగారు. ఎస్సీల నుంచి భట్టి విక్రమార్క సీఎం రేసులో ఉన్నారని, అదే ఎస్టీల నుంచి సీతక్కకు డిప్యూటీ సీఎంగానైనా అవకాశం ఇస్తారా? అంటూ అడిగారు. దీనికి సమాధానం ఇస్తూ కాంగ్రెస్ పార్టీ అన్ని వర్గాలకు సముచిత స్థానం ఇస్తుందని అన్నారు. అవసరమైతే డిప్యూటీ సీఎం కాదు.. సీతక్క సీఎం అయినా కావొచ్చని వివరించారు. ఈ వ్యాఖ్యలు చర్చనీయాంశం అయ్యాయి.

Also Read: పేషెంట్‌తో నర్సు ఎఫైర్.. హాస్పిటల్‌లో సెక్స్ చేస్తుండగా మరణించిన పేషెంట్

ఈ వ్యాఖ్యలు అధిష్టానం దృష్టికి వెళ్లాయి. దీంతో టీ కాంగ్రెస్ నేతలు సీఎం సీటు విషయమై కామెంట్స్ చేయవద్దనే హెచ్చరికలు వెళ్లినట్టు సమాచారం.

PREV
click me!

Recommended Stories

Brahmanandam Spech: వెంకయ్య నాయుడుపై బ్రహ్మానందం పంచ్ లు | Asianet News Telugu
Venkaiah Naidu Attends Sankranti: ఈ చిన్నారి రికార్డ్ చూసి వెంకయ్య నాయుడు షాక్| Asianet News Telugu