ఈసీ నోటీసుకు కేసీఆర్ వివరణ ఇదీ.....

Published : Apr 12, 2019, 04:57 PM IST
ఈసీ నోటీసుకు కేసీఆర్ వివరణ ఇదీ.....

సారాంశం

కేంద్ర ఎన్నికల సంఘం ఇచ్చిన నోటీసుకు తెలంగాణ సీఎం కేసీఆర్ వివరణ ఇచ్చారు


హైదరాబాద్: కేంద్ర ఎన్నికల సంఘం ఇచ్చిన నోటీసుకు తెలంగాణ సీఎం కేసీఆర్ వివరణ ఇచ్చారు. కరీంనగర్ ఎన్నికల సభలో ఆయన చేసిన వ్యాఖ్యలు హిందువుల మనోభావాలకు వ్యతిరేకంగా ఉన్నాయంటూ వీహెచ్‌పీ రాష్ట్ర అధ్యక్షుడు ఎం. రామరాజు చేసిన ఫిర్యాదు మేరకు ముఖ్యమంత్రికి ఈసీ కేసీఆర్ నోటీసు జారీ చేసిన విషయం తెలిసిందే.

హిందువుల మనోభావాలను దెబ్బతీసేలా వ్యాఖ్యలు చేసినందుకు గాను శుక్రవారం సాయంత్రం లోపుగా వివరణ ఇవ్వాలని  ఈసీ ఆదేశాలు జారీ చేసింది. దీంతో శుక్రవారం నాడు ఉదయమే కేసీఆర్ తన వివరణను ఈసీకి అందించారు. ఈ మేరకు వివరణతో కూడిన ప్రతిని రాష్ట్ర ఎన్నికల అదనపు ప్రధానాధికారి జ్యోతిబుద్దప్రకాష్‌కు టీఆర్ఎస్‌ నేతలు అందించారు.

PREV
click me!

Recommended Stories

IMD Cold Wave Alert : మరోసారి కుప్పకూలనున్న టెంపరేచర్స్.. ఈ నాల్రోజులు చుక్కలే
Hyderabad IT Jobs : మీరు సాప్ట్ వేర్ జాబ్స్ కోసం ప్రయత్నిస్తున్నారా..? కాగ్నిజెంట్ లో సూపర్ ఛాన్స్, ట్రై చేయండి