ఫిబ్రవరిలో కేసీఆర్ కేబినెట్ విస్తరణ: ఆ ఎనిమిది మంది వీరే

By narsimha lodeFirst Published Jan 2, 2019, 7:30 PM IST
Highlights

కేసీఆర్ తొలి దఫా మంత్రివర్గంలో ఎనిమిది మందికి ఛాన్స్ దక్కనుంది.


హైదరాబాద్: కేసీఆర్ తొలి దఫా మంత్రివర్గంలో ఎనిమిది మందికి ఛాన్స్ దక్కనుంది. అయితే ఇందులో  నలుగురు పాతవారికి మాత్రం అవకాశం ఉంటుంది.మరో నలుగురు కొత్తవారికి మంత్రి పదవులు దక్కనున్నాయి. కొత్తవారైనా, పాతవారైన పనిని ప్రామాణీకింగా తీసుకొనే కేసీఆర్ తన కేబినెట్‌లోకి తీసుకొనే అవకాశం లేకపోలేదు.

గ్రామ పంచాయితీ ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చినందున కేబినెట్ విస్తరణ ఫిబ్రవరి మాసంలోనే ఉంటుంది.  ఎన్నికల కోడ్  కారణంగా సంక్రాంతి  తర్వాత ఉంటుందని  భావించిన కేబినెట్ విస్తరణ  ఫిబ్రవరికి వాయిదా పడింది.

కేబినెట్‌లో చోటు కోసం టీఆర్ఎస్ ప్రజా ప్రతినిధులు ఆశగా ఎదురు చూస్తున్నారు కేటీఆర్ చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. కేబినెట్‌లో బెర్త్ కోసం కేసీఆర్ ను ప్రసన్నం చేసుకొనే ప్రయత్నాలు చేస్తున్నారు.

తొలి విడతలో ఎనిమిది మందికే కేసీఆర్ తన మంత్రివర్గంలో చాన్స్ ఇవ్వనున్నారు. వీరిలో  నలుగురు పాత మంత్రులకు ఛాన్స్ దక్కనుంది. పాత వారిలో కేటీఆర్, హరీష్ రావు, పోచారం శ్రీనివాస్ రెడ్డి లేదా ఈటల రాజేందర్‌ ను మంత్రివర్గంలోకి తీసుకొంటారు. గత టర్మ్‌లో డిప్యూటీ స్పీకర్‌గా పనిచేసిన పద్మా దేవేందర్ రెడ్డికి ఈ దఫా కేబినెట్‌లో బెర్త్ ఖాయంగా కన్పిస్తోంది.

ఈటెల రాజేందర్ లేదా, పోచారం శ్రీనివాస్ రెడ్డిలలో ఎవరో ఒకరికి పాత కేబినెట్‌లోని వారికి ఛాన్స్ దక్కే అవకాశం ఉందంటున్నారు. గత టర్మ్‌లో మంత్రి పదవి లేకున్నా పద్మా దేవేందర్ రెడ్డికి ఈ దఫా కేబినెట్ బెర్త్ ఖాయంగా కన్పిస్తోందనే ప్రచారం సాగుతోంది.

ఇక కొత్తవారిలో నలుగురికి ఎవరికి ఛాన్స్ ఉంటుందనే చర్చ పార్టీ వర్గాల్లో సాగుతోంది. కేటీఆర్‌కు, కేసీఆర్ కు అత్యంత సన్నిహితులుగా ముద్ర పడిన వారంతా కూడ కేబినెట్‌లో బెర్త్ కోసం ఆశగా ఎదరుచూస్తున్నారు.

వేముల ప్రశాంత్ రెడ్డి,  కొప్పుల ఈశ్వర్, సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, గుత్తా సుఖేందర్ రెడ్డిలకు ఛాన్స్ దక్కే అవకాశం ఉంది.  మిగిలిన వారికి పార్లమెంట్ ఎన్నికల తర్వాత కేబినెట్ విస్తరణలో ఛాన్స్ దక్కనుంది. అయితే పార్లమెంట్ ఎన్నికల తర్వాత కేంద్రంలో చోటు చేసుుకొనే రాజకీయ పరిణామాల నేపథ్యంలో కేసీఆర్ ఢిల్లీ రాజకీయాల్లో తలమునకలయ్యే పరిస్థితి ఎదురైతే కేటీఆర్ కు సీఎం పగ్గాలు ఇచ్చే అవకాశం ఉందంటున్నారు.

సంబంధిత వార్తలు

ఎన్నికల ఎఫెక్ట్: ఫిబ్రవరిలో కేసీఆర్ కేబినెట్ విస్తరణ

నెలాఖరులో కేసీఆర్ కేబినెట్ విస్తరణ: ఎనిమిది మందికే ఛాన్స్?

నెలాఖరులో కేసీఆర్ కేబినెట్ విస్తరణ: ఎనిమిది మందికే ఛాన్స్?

ఈ సారైనా ఆ నలుగురికి కేబినెట్ బెర్త్ దక్కేనా

click me!