అమిత్ షా దళిత భోజనం.. గుట్టురట్టు చేసిన కేసీఆర్ !

First Published May 24, 2017, 5:41 PM IST
Highlights

అమిత్ షా దళిత భోజనం అసలు కథేంటో ఫేస్ బుక్ లోనే అందరం చూశామంటూ కమలనాథులను తనదైన స్టైల్ లో ఏకిపడేశారు తెలంగాణ సీఎం కేసీఆర్.

దళితుల ఇంట్లో భోజనం...

 

ఇప్పుడిది రాజకీయ పార్టీల కొత్త ప్రచార ఎత్తుగడ...

 

దళితుల ఇంట్లో భోజనాలు చేయడం వారితో కలిసి ఫోటోలకు ఫోజులివ్వడం అన్ని పార్టీలకు రివాజుగా మారిపోయింది. కాంగ్రెస్ తో మొదలెట్టి బీజేపీ వరకు ఇప్పుడు అన్ని పార్టీలదీ ఇదే రూటు.

 

తాజాగా పార్టీ బలోపేతం దిశగా తెలంగాణలో అడుగుపెట్టిన బీజేపీ అధినేత అమిత్ షా తన నల్లగొండ జిల్లా పర్యటనలో భాగంగా తెరాట్ పల్లిలో దళితులతో కలిసి సహపంక్తి భోజనాలు చేశారు.

 

దానికి మీడియా కూడా పెద్దస్థాయిలో ప్రచారం కల్పించింది. అయితే సోషల్ మీడియాలో మాత్రం ఆయన దళితభోజనం పై మండిపడింది. మినరల్ వాటర్ బాటిళ్లు, ఎక్కడో వండితెచ్చిన భోజనాలను దళితులతో కలిసి తింటే దళితభోజనం ఎలా అవుతుందంటూ ప్రశ్నించింది.

 

ఇప్పుడు సీఎం కేసీఆర్ కూడా ఇదే మాటలతో అమిత్ షాను, బీజేపీని ఇరుకునపెట్టేశారు.

 

మనోహర్ రెడ్డి అనే అగ్రకులవ్యక్తి తోటలో వండుకొచ్చిన భోజనాన్ని దళితవాడలో తిని డ్రామాలాడారని అమిత్ షా పై విరుచుకపడ్డారు.

 

కమ్మగూడెంలో వండిన భోజనాన్ని తెరాట్ పల్లికి తీసొచ్చి దళితలతో కలిసి తిన్నారని , ఫొటోలకు ఫోజులిచ్చారని విమర్శించారు. తెరాట్ పల్లిలో అమిత్ షా తిన్నది దళిత భోజనం కాదని అన్నారు.

 

తెలంగాణ గడ్డ మీద ఇలాంటి జిమ్మికులు పనికిరావని సూచించారు. సోషల్ మీడియాలో మీ భోజనాల కథేందో బయటపడిందని ఎద్దేవా చేశారు. సోషల్ మీడియాకు భయపడే ఈరోజు బీజేపీ నేతలు దళితుల ఇంట్లో వండితిన్నరని విమర్శించారు.

 

click me!