అబద్దాలాడాలంటున్న కలెక్టరమ్మ.. వద్దంటున్న మంత్రి కడియం

First Published May 24, 2017, 4:39 PM IST
Highlights

వరంగల్ లో విద్యార్థులకు కలెక్టర్, కడియం పోటాపోటీ క్లాసులు

సాక్షాత్తు జిల్లా కలెక్టరే అబద్దాలాడాలంటూ పబ్లిక్ గా విద్యార్థులకు అడ్వైస్  ఇచ్చేస్తుంది. ఇంతకీ ఎందుకో తెలుసా... ఉద్యోగం కోసం ఇంటర్వ్యూకు వచ్చినప్పుడు....

 

ఉద్యోగం సంపాదించాలంటే ఇంటర్వ్యూలో అబద్దాలాడక తప్పదని చెప్పేశారు. నిజాయితీగా ఉంటే ఉద్యోగాలు రావన్నారు. ఓరుగల్లులోని ఐటీఐ  కళాశాల ఆవరణలో మెగా జాబ్‌మేళా కార్యక్రమం నిర్వహించారు.

 

ఇందులో వరంగల్ అర్బన్ జిల్లా కలెక్టర్‌, మంత్రులు నాయిని నరసింహారెడ్డి, కడియం శ్రీహరి పాల్గొన్నారు. ఈ సందర్భంగా అమ్రపాలి మాట్లాడుతూ...  ఉద్యొగం కోసం అబద్దాలు ఆడాల్సివస్తుందని అదేం తప్పుకాదని విద్యార్థులకు సూచించారు.

 

అయితే ఉప ముఖ్యమంత్రి కడియం మాత్రం ఆమె వ్యాఖ్యలను ఖండించారు. ఉద్యోగం కోసం అబద్దాలు ఆడాల్సిన అవసరం లేదన్నారు. కలెక్టర్ మాటలు నమ్మి అబద్దాలు ఆడితే ఇవ్వాల్సిన ఉద్యోగం కూడా ఇవ్వరని హెచ్చరించారు.

 

అయితే ఇద్దరి మాటల్లో ఎవరి మాట వినాలో తెలియక అక్కడికి వచ్చిన అభ్యర్థులు కాస్త అయోమయానికి గురయ్యారు. 

 

click me!