అమిత్ షా... నా లెక్క తప్పైతే రాజీనామా చేస్తా

First Published May 24, 2017, 5:24 PM IST
Highlights

బీజేపీ అధినేతపై సీఎం కేసీఆర్ ఫైర్.. నిజాలు తెలుసుకొని మాట్లాడాలని సూచన

ఒక వైపు దేశ ప్రధాని నరేంద్ర మోదీ తెలంగాణ ప్రగతిని చూసి పొగుడుతుంటే కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ పార్టీ అధినేత అమిత్ షా తెలంగాణను కించపరుస్తూ మాట్లాడుతుండటం దురదృష్టకరమని సీఎం కేసీఆర్ అన్నారు.  

 

ఈ రోజు ఆయన ప్రగతి భవన్ లో మీడియాతో మాట్లాడారు. రూ. 90 వేల కోట్లు రాష్ట్రానికి ఇచ్చినట్లు అమిత్ షా చెబుతున్నారు. దమ్ముంటే ఆ వివరాలు బయటపెట్టాలని డిమాండ్ సీఎం డిమాండ్ చేశారు. నన్ను  పది మాటలన్నా పడుతా తెలంగాణను ఒక్క మాట అన్నా సహించేది లేదన్నారు. కేంద్రానికి పన్నుల రూపంలో తెలంగాణ వేల కోట్ల రూపాయిలు చెల్లిస్తుందన్నారు. దేశాన్ని ఆదుకునే రాష్ట్రాలలో తెలంగాణ ఒకటి... మా డబ్బుతోనే కేంద్రం నడుస్తోందని పేర్కొన్నారు.

 

అన్ని రాష్ట్రాలకు మాదిరిగానే కేంద్రం తెలంగాణకు వివిధ పథకాల కింద నిధులు మంజూరు చేసింది కానీ, రాష్ట్రానికి అదనంగా కేంద్రం ఒక్క పైసా కూడా కేంద్రం ఇవ్వలేదన్నారు.

తెలంగాణను కించపరుస్తూ మాట్లాడితే ప్రాణంపోయినా కాంప్రమైప్ అయ్యే ప్రశ్నే లేదన్నారు.

 

మూడు రోజులు ఇక్కడే ఉండి అమిత్ షా తెలంగాణ పై అవాకులు చెవాకులు పేల్చుతున్నారని మండిపడ్డారు.

 

తాము ఇతర రాష్ట్రాలతో కాదు ప్రపంచంతో పోటీపడుతున్నామని గుర్తు చేశారు. ‘తొమ్మిది రాష్ట్రాల అధికారులు , మంత్రులు ఇక్కడికి వచ్చి మా ప్రభుత్వ పథకాలను పరిశీలించి పొగిడి వెళ్తున్నారు. తెలంగాణ దేశంలోనే సుసంపన్నమైన దేశం. సాక్షాత్తు ప్రధాని మోదీ రాష్ట్రాన్ని పొగిడితే ఆ పార్టీ అధినేత ఎందుకు తెగుడుతున్నారు. నల్లగొండ లో అమిత్ షా చెప్పినవన్నీ ఆ వాస్తవాలే‘ అని కొట్టిపారేశారు.

అవాస్తవాలు ప్రచారం చేసినందుకు అమిత్ షా తెలంగాణ ప్రజలకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. తాను చెప్పిన లెక్కలు అవాస్తవాలైతే తానే పదవికి రాజీనామా చేస్తామని చాలెంజ్ చేశారు.

 

click me!