పూల్వామా దాడి: కేసీఆర్ మనస్తాపం, జన్మదిన వేడుకలకు దూరం

By narsimha lodeFirst Published Feb 15, 2019, 12:12 PM IST
Highlights

కాశ్మీర్‌లోని పుల్వామాలో  సీఆర్‌పీఎఫ్  జవాన్లపై ఉగ్రవాదుల దాడిని  తెలంగాణ సీఎం కేసీఆర్  తీవ్రంగా ఖండించారు. 

హైదరాబాద్: కాశ్మీర్‌లోని పుల్వామాలో  సీఆర్‌పీఎఫ్  జవాన్లపై ఉగ్రవాదుల దాడిని  తెలంగాణ సీఎం కేసీఆర్  తీవ్రంగా ఖండించారు. ఈ ఘటనపై ఆయన తీవ్రంగా కలత చెందారు. ఈ నెల 17వ తేదీన తన పుట్టినరోజు సందర్భంగా ఎలాంటి ఉత్సవాలను జరుపుకోరాదని సీఎం నిర్ణయించారు.

గురువారం సాయంత్రం పుల్వామా వద్ద ఉగ్రవాదులు జరిపిన దాడిలో 42 మంది సీఆర్‌పీఎప్ జవాన్లు మృత్యువాత పడ్డారు. పలువురు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటనలో మృతి చెందిన సైనికుల కుటుంబాలకు కేసీఆర్ సంతాపం తెలిపారు. ఈ ఘటనతో దేశ ప్రజలంతా విషాదంలో మునిగిపోయారని  కేసీఆర్ అభిప్రాయపడ్డారు. 

ఈ ఘటనతో తాను తీవ్ర మనస్థాపానికి గురైనట్టుగా ఆయన ప్రకటించారు. దేశమంతా విషాదంలో ఉన్న సమయంలో ఉత్సవాలు జరుపుకోవడం సరైంది కాదన్నారు. ఈ నెల 17వ తేదీన తన పుట్టిన రోజును పురస్కరించుకొని ఎలాంటి ఉత్సవాలు చేసుకోవద్దని ఆయన సూచించారు.  పార్టీ నేతలు, కార్యకర్తలు, అభిమానులు ఎవరూ కూడ తన పుట్టిన రోజు వేడుకలను జరపకూడదని  కేసీఆర్ సూచించారు.

సంబంధిత వార్తలు

పుల్వామా దాడి: పాకిస్తాన్‌కు మోడీ హెచ్చరికలు

42 మందిని పొట్టన పెట్టుకున్న టెర్రరిస్ట్: ఎవరీ ఆదిల్?

"నేను స్వర్గంలో ఉంటా": జవాన్లపై దాడి చేసిన ఉగ్రవాది చివరి మాటలు

జమ్మూ కశ్మీర్‌లో ఆత్మాహుతి దాడి... 350 కిలోల పేలుడు పదార్థాలతో

జమ్మూ కశ్మీర్‌లో మరోసారి తెగబడిన ముష్కరులు..20మంది ఆర్మీ జవాన్ల మృతి

 

click me!