బీజేపీ దూకుడు: చెక్ పెట్టే దిశగా కేసీఆర్ ప్లాన్ ఇదీ....

By narsimha lode  |  First Published Sep 8, 2019, 1:47 PM IST

రాష్ట్రంలో బీజేపీ దూకుడుగా వెళ్తోంది. దీనికి చెక్ పెట్టాలని కేసీఆర్ భావిస్తున్నాడు. బీజేపీకి చెక్ పెట్టేందుకు వీలుగా కార్యాచరణను సిద్దం చేశాడు.


హైదరాబాద్: బీజేపీ దూకుడుకు కళ్లెం వేసే దిశగా టీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ పావులు కదుపుతున్నారు. పదవుల విషయంలో అసంతృప్తిగా ఉన్న నేతలను సంతృప్తి పర్చేందుకు కేసీఆర్ పదవుల పందేరాన్ని ప్రారంభించారు. ఇందులో భాగంగానే కేసీఆర్ మంత్రివర్గ విస్తరణను చేపట్టారు.

తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ దూకుడుగా వెళ్తోంది. ఇతర పార్టీల నుండి తమ పార్టీలోకి వలసలను ప్రోత్సహిస్తోంది, వచ్చే ఎన్నికల నాటికి తెలంగాణలో అధికారంలోకి రావాలనే వ్యూహంతో కమల దళం కదనరంగంలోకి అడుగుపెట్టింది. 

Latest Videos

ఈ ఏడాది ఏప్రిల్ మాసంలో జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ నాలుగు ఎంపీ స్థానాలను కైవసం చేసుకొంది.గత ఏడాది డిసెంబర్ 7వ తేదీన జరిగిన ఎన్నికల్లో బీజేపీకి ఒక్క అసెంబ్లీ స్థానం మాత్రమే దక్కింది.

పార్లమెంట్ ఎన్నికల్లో వచ్చిన ఫలితాలు బీజేపీ క్యాడర్‌లో ఉత్సాహన్ని ఇచ్చాయి. టీడీపీకి చెందిన ద్వితీయ శ్రేణి నాయకులతో పాటు ఇతర పార్టీలకు చెందిన నేతలు కూడ బీజేపీలో చేరారు. కాంగ్రెస్ పార్టీకి చెందిన కొందరు నేతలకు కూడ బీజేపీ నాయకత్వం గాలం వేస్తోంది.

మరో వైపు టీఆర్ఎస్ లో అసంతృప్తిగా ఉన్న నేతలను కూడ తమ వైపుకు తిప్పుకొనేందుకు బీజేపీ పావులు కదుపుతోంది. టీఆర్ఎస్ నేతలతో కూడ బీజేపీ నేతలు టచ్‌లోకి వెళ్లినట్టుగా ప్రచారం కూడ సాగింది.

టీఆర్ఎస్ కు చెందిన కొందరు నేతలు కూడ బహిరంగంగా విమర్శలు చేయడం కూడ తమ అసంతృప్తిని బయటపెట్టినట్టుగా కన్పిస్తోంది. మంత్రి పదవి విషయంలో  ఈటల రాజేందర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలకు మద్దతుగా  రసమయి బాలకిషన్  కూడ కీలకమైన మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్ బోర్డు మినహా ఎలాంటి మార్పు రాలేదని రసమయి బాలకిషన్ చేసిన వ్యాఖ్యలు టీఆర్ఎస్ లో చర్చకు దారి తీశాయి.

ఈ పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని కేసీఆర్ మంత్రివర్గ విస్తరణను చేపట్టారు. ఖాళీగా ఉన్న ఆరు స్థానాలను ఆదివారం నాడు భర్తీ చేయనున్నారు.  కేబినెట్ విస్తరణకు ముందే అసెంబ్లీ సమావేశాలను దృష్టిలో ఉంచుకొని ఎమ్మెల్యేలకు కొన్ని పదవులను ఇచ్చారు.

తెలంగాణ శాసనసభకు చీఫ్ విప్ తో పాటు ఆరుగురు విప్ లను ప్రభుత్వం నియమించింది.ప్రభుత్వ చీఫ్ విప్ గా దాస్యం వినయ్ బాస్కర్  ను నియమిస్తూ కేసీఆర్ నిర్ణయం తీసుకొన్నారు. వినయ్ భాస్కర్ తో పాటు మరో ఆరుగురు ఎమ్మెల్యేలు గొంగిడి సునీత, గంప గోవర్ధన్, గువ్వల బాలరాజు, అరికెపూడి గాంధీ, రేగా కాంతారావు, బాల్క సుమన్ లను విప్ లుగా నియమించారు.

గత అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి ఓటమి పాలైన  పార్టీ సీనియర్లకు కూడ పదవులను కట్టబెట్టాలని కేసీఆర్ భావించారు.చ మాజీ మంత్రులు జూపల్లి కృష్ణారావు,నాయిని నర్సింహరెడ్డిలతో పాటు మాజీ స్పీకర్ మధుసూధనాచారిలకు నామినేటేడ్ పోస్టులను కేసీఆర్ కబ్టబెట్టే అవకాశం ఉంది.

ఎమ్మెల్సీ గుత్తా సుఖేందర్ రెడ్డిని శాసనమండలి ఛైర్మెన్ గా నియమించే ఛాన్స్ ఉంది. ఇక మరో 12 మంది ఎమ్మెల్యేలను కార్పోరేషన్ ఛైర్మెన్లుగా  కేసీఆర్ నియమించాలని భావిస్తున్నారు.

తెలంగాణలో బీజేపీ దూకుడును అరికట్టేందుకు వీలుగా పార్టీ నేతలకు పదవులను ఇవ్వడం ద్వారా పార్టీ క్యాడర్ ను సంతృప్తి పర్చాలని కేసీఆర్ భావిస్తున్నారు.  రానున్న రోజుల్లో పార్టీకి చెందిన సీనియర్ల సేవలను కూడ పార్టీ కోసం వినియోగించుకొనే అవకాశం లేకపోలేదు.

తెలంగాణ రాష్ట్రానికి సౌందర రాజన్ ను గవర్నర్ గా నియమించడం వెనుక బీజేపీ వ్యూహత్మకంగా అడుగులు వేస్తోందనే ప్రచారం సాగుతోంది.ఈ తరుణంలోనే కేసీఆర్ కూడ ముందు జాగ్రత్త చర్యలు తీసుకొంటున్నారు. బీజేపీకి వ్యతిరేకంగా కేసీఆర్ కూడ తన పార్టీకి నష్టం వాటిల్లకుండా ఉండే చర్యలకు ఉపక్రమించారు. 

సంబంధిత వార్తలు

బెర్త్ ఖరారైన అభ్యర్థులకు ఫోన్ కాల్స్: హరీష్ ఉన్నా కేసీఆర్ తర్వాత కేటీఆరే

ఈటలతో నాకు విభేదాలు లేవు: గంగుల

మంత్రి పదవిపై తేల్చేశారా: కేసీఆర్‌తో ఈటల రాజేందర్ భేటీ

కేసీఆర్ కేబినెట్ విస్తరణ: ఉద్వాసన ఎవరికీ

నేడే మంత్రివర్గ విస్తరణ: ఆ ఆరుగురు వీరే....

కేసీఆఆర్ మంత్రివర్గ విస్తరణకు ముహూర్తం ఖరారు: కొత్తగా నలుగురే

కేసీఆర్ కేబినెట్: కేటీఆర్, హరీష్‌లలో ఎవరికి చోటు?

దసరా తర్వాత కేసీఆర్ కేబినెట్ విస్తరణ: హరీష్‌‌కు చోటు, కారణమదేనా

సుఖేందర్ రెడ్డికి కేసీఆర్ బంపర్ ఆఫర్ ఇదే....

 

click me!