50 ఏళ్లు ఏం చేశారు, ఒక్క అవకాశమంటున్నారు: ఆర్మూర్ సభలో కాంగ్రెస్ పై కేసీఆర్ ఫైర్

By narsimha lode  |  First Published Nov 3, 2023, 4:40 PM IST

తమ ప్రభుత్వ హయంలో  ఇప్పటివరకు  అమలు చేస్తున్న పథకాలతో పాటు  రానున్నరోజుల్లో  చేయనున్న పథకాలపై  కేసీఆర్ ప్రచారం చేస్తున్నారు. ప్రతి రోజూ మూడు సభల్లో కేసీఆర్ పాల్గొంటున్నారు.


ఆర్మూర్: రైతు బంధు బిచ్చమెస్తున్నారని  రైతుల గురించి  హీనంగా మాట్లాడుతున్నారని  తెలంగాణ సీఎం కేసీఆర్ కాంగ్రెస్ తీరును దుయ్యబట్టారు.శుక్రవారంనాడు ఆర్మూర్ సభలో  బీఆర్ఎస్ సభలో తెలంగాణ సీఎం కేసీఆర్  ప్రసంగించారు. రైతుల కోసం తమ ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను  కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఎత్తివేయనుందన్నారు.  రైతుబంధు,  ధరణి, వ్యవసాయానికి 24 గంటల విద్యుత్ అవసరం లేదని కాంగ్రెస్ నేతలు  ప్రచారం చేస్తున్నారని  తెలంగాణ సీఎం కేసీఆర్ ఆరోపించారు. 

వ్యవసాయానికి  24 గంటల పాటు విద్యుత్ ను అందిస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ మాత్రమేనని ఆయన  చెప్పారు. ప్రధాని  మోడీ రాష్ట్రంలో కూడ  24 గంటల పాటు విద్యుత్ సరఫరా చేయడం లేదన్నారు.   రైతులకు 24 గంటల విద్యుత్ అవసరం లేదని  కాంగ్రెస్ నేతలు  చెబుతున్నారన్నారు.24 గంటల విద్యుత్ ఉండాలా వద్దో చెప్పాలని ఆయన ప్రజలను కోరారు.  రైతులకు  ఉచితంగా విద్యుత్, నీళ్లు , పెట్టుబడి సహాయం అందిస్తున్న విషయాన్ని కేసీఆర్ వివరించారు.ధరణి తీసేస్తే రైతుబంధు, రైతు భీమా ఎలా వస్తుందని ఆయన ప్రశ్నించారు. రైతు బంధును కూడ విమర్శిస్తున్నారన్నారు.  రైతుబంధుపై  ప్రముఖ వ్యవసాయ శాస్త్రవేత్త స్వామినాథన్,  యూఎన్ఓ కూడ ప్రశంసించిన విషయాన్ని కేసీఆర్ గుర్తు చేశారు. 

Latest Videos

undefined

also read:మత ఘర్షణల తెలంగాణ కావాలా.. ప్రశాంత తెలంగాణ కావాలా:భైంసా సభలో విపక్షాలపై కేసీఆర్ ఫైర్

రాష్ట్రానికి ఆదాయం పెరుగుతున్నకొద్దీ  సంక్షేమ పథకాలను  పెంచుకుంటూపోయినట్టుగా  కేసీఆర్ వివరించారు. ఒక్కోక్క సమస్యను పరిష్కరించుకుంటూ  ముందుకు వెళ్తున్నట్టుగా కేసీఆర్ చెప్పారు

 

Live: ప్రజా ఆశీర్వాద సభ, ఆర్మూర్ https://t.co/ZUvuxx8Cv5

— BRS Party (@BRSparty)

బీడీ కార్మికులకు పెన్షన్ ఎక్కడా కూడ లేదన్నారు.  కొత్తగా  బీడీ కార్మికులకు పెన్షన్ ఇచ్చే విషయాన్ని ఎన్నికల తర్వాత నిర్ణయం తీసుకుంటామని కేసీఆర్ హామీ ఇచ్చారు.కాంగ్రెస్ పార్టీ ఒక్క అవకాశం ఇవ్వాలని అడుగుతుందన్నారు. కానీ  ,11 దఫాలు  అధికారం ఇస్తే  ఏం చేసిందని ఆయన  కాంగ్రెస్ ను ప్రశ్నించారు. అధికారంలో ఉన్న సమయంలో ప్రజల గురించి పట్టించుకోని కాంగ్రెస్ నేతలు ఇవాళ ఒక్క అవకాశం అంటూ ముందుకు వస్తున్నారని ఆయన  విమర్శలు చేశారు.

click me!