ఈ ఎన్నికల్లో వైఎస్ఆర్‌టీపీ కాంగ్రెస్ కు మద్దతివ్వడంపై మాటల యుద్ధం సాగుతుంది. రాజకీయంగా ఈ అంశాన్నితమకు అనుకూలంగా మలుచుకొనే విషయమై బీఆర్ఎస్ ప్రయత్నాలు చేస్తుంది.
హైదరాబాద్:ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ కు వైఎస్ఆర్‌టీపీ చీఫ్ వైఎస్ షర్మిల మద్దతు తెలపడంపై హర్షం వ్యక్తం చేశారు సీఎల్పీ నేత మల్లుభట్టి విక్రమార్క.శుక్రవారంనాడు సీఎల్పీ నేత మల్లుభట్టి విక్రమార్క హైద్రాబాద్ లో మీడియాతో మాట్లాడారు. వైఎస్ఆర్ బిడ్డగా కాంగ్రెస్ తో షర్మిల కలిసి రావడం శుభపరిణామంగా ఆయన పేర్కొన్నారు.హుజూరాబాద్ లో ఓట్ల కోసమే కేసీఆర్ దళితబంధు తెచ్చారని ఆయన విమర్శించారు. దళితబంధుకు బడ్జెట్ లో రూ. 17 వేల కోట్లు ప్రకటించిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. ఈ ఏడాది దళితబంధు పథకాన్ని ఎందరికి ఇచ్చారో చెప్పాలని ఆయన ప్రశ్నించారు.దళితులకు మూడెకరాల భూమి ఏమైందని ఆయన అడిగారు.ప్రజలకు కేసీఆర్ కలల ప్రపంచం చూపారని ఆయన విమర్శించారు.
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఎక్కడి నుండి పోటీ చేయాలనేది ఎంఐఎం చీఫ్ ఓవైసీకి అవసరం లేదని ఆయన చెప్పారు. ఎంఐఎం అభ్యర్ధుల గురించి ఓవైసీ పట్టించుకొంటే సరిపోతుందన్నారు.లెఫ్ట్ పార్టీలతో పొత్తుపై జాతీయ స్థాయిలో చర్చలు జరుగుతున్నాయని భట్టి విక్రమార్క చెప్పారు. చర్చలు ముగిసిన తర్వాత వివరాలను వెల్లడిస్తామని ఆయన తెలిపారు.
undefined
ఈ ఎన్నికల్లో దొరల తెలంగాణ, ప్రజా తెలంగాణ మధ్య యుద్ధం జరుగుతుందని భట్టి విక్రమార్క అభిప్రాయపడ్డారు. ఈ యుద్ధంలో ప్రజలే గెలవాల్సిన అవసరం ఉందని రాహుల్ గాంధీ కోరుకుంటున్నారని భట్టి విక్రమార్క చెప్పారు.దళితులకు ఇచ్చిన హామీలు కేసీఆర్ నిలుపుకోలేదని ఆయన విమర్శించారు. యువత ఆత్మహత్యలకు కేసీఆర్ సర్కార్ కారణమౌతుందని ఆయన ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ తెచ్చిన ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ ను కూడ అమలు చేయలేదని భట్టి విక్రమార్క విమర్శలు చేశారు.
also read:కాంగ్రెస్‌కు వైఎస్ఆర్‌టీపీ మద్దతు, పోటీకి దూరం: వైఎస్ షర్మిల కీలక ప్రకటన
మోసపూరిత వాగ్దానాలతో ప్రజలను కేసీఆర్ మోసం చేస్తున్నారన్నారు. తెలంగాణ ప్రజల కలలను కాంగ్రెస్ మాత్రమే నిజం చేస్తుందని భట్టి విక్రమార్క హామీ ఇచ్చారు.దశాబ్దాల తెలంగాణ యువత కలను కాంగ్రెస్ సాకారం చేసిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు.