
హైదరాబాద్ : Chief Minister of Telangana కె. చంద్రశేఖర్ రావు Birthday సందర్భంగా పలువురు ప్రముఖులు ఆయనకు Best wishes తెలిపారు. ప్రధాని మోడీ, ఐటీ, పట్టణాభివృద్ధి శాఖమంత్రి కేటీఆర్, ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావులతో పాటు.. బీజేపీ తెలంగాణ అధినేత బండి సంజయ్, తెలంగాణ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిలు ఉన్నారు.
ఊసరవెల్లితో పోలుస్తూ...
కాగా కేసీఆర్ కు శుభాకాంక్షలు తెలుపుతూ Rewanth Reddy చేసిన ట్వీట్ ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. జన్మదిన శుభాకాంక్షలు అంటూ ఊసరవెల్లి.. ఫొటోనూ షేర్ చేశాడు. అయితే శుభాకాంక్షలు ఎవరికో ఆయన ప్రస్తావించలేదు. కాకపోతే ఈ రోజు కేసీఆర్ పుట్టినరోజు కావడంతో ఇది ఆయనను ఉద్దేశించే అనేది తెలుస్తోంది.
కేసీఆర్ మీద మనసులో ఎంత వ్యతిరేకత ఉందో ఈ ట్వీట్ తో తెలుస్తోందని పలువురు అంటున్నారు. రాజకీయాలను ఇలాంటి వాటికి ముడిపెట్టి, హుందాగా ఉండాల్సిన చోట.. ఇలా దిగజారడం రేవంత్ రెడ్డికి తగదని పలువురు వ్యాఖ్యనిస్తున్నారు.
నా తండ్రి అయినందుకు గర్వంగా ఉంది...
ఐటీ, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి KTR ముఖ్యమంత్రి KCR కు పుట్టిన రోజు శుభాకాంక్షలు చెబుతూ.. తనకు తండ్రిని చూసి చాలా గర్వంగా ఉందంటూ చెప్పుకొచ్చారు. ‘ఎప్పుడూ పెద్ద కలలే కనే వ్యక్తి, అసాధ్యాన్ని సుసాధ్యం చేయడాన్ని కళగా మార్చుకున్న వ్యక్తి, దయార్ద్రహృదయుడు, ధైర్యానికి నిర్వచనం.. పరిస్థితులకు ఎదురొడ్డి.. సవాళ్లు విసిరే వ్యక్తి.. ఆ వ్యక్తి మా నాయకుడు, నా తండ్రి.. అని గర్వంగా పిలుచుకునే వ్యక్తి.. మీరు దీర్ఘకాలం ఆయురారోగ్యాలతో ఉండాలి’ అంటూ ఎమోషనల్ ట్వీట్ చేశారు.
దేశానికి నూతన దిశ కేసీఆర్..!
ఆరోగ్య శాఖ మంత్రి Harish Rao కేసీఆర్ జన్మదినం సందర్బంగా రక్తదానం చేశారు. అంతేకాదు.. ‘రెండు దశాబ్దాలుగా తెలంగాణ రాజకీయాల్ని ప్రభావితం చేస్తున్నారు కేసీఆర్ గారు. ‘బై ఛాన్స్’ ఆయన రాజకీయాలలోకి రాలేదు, ‘బై ఛాయిస్’ వాటిని ఎంచుకున్నారు’ అంటూ ఓ పేపర్ క్లిప్పింగ్ ను షేర్ చేశారు.
అంతకు ముందు ‘దశాబ్దాల ప్రత్యేక తెలంగాణ కల మీ వల్లే నెరవేరింది. భావి తరాల బంగారు తెలంగాణ మీ వల్లే సాధ్యమవుతుంది. మీరు ముఖ్యమంత్రి అయ్యాకే తెలంగాణ తలరాత మారింది. మీ నాయకత్వంలో రాష్ట్రం ప్రగతిపథంలో దూసుకుపోతున్నది. గత కాలపు వెతలన్నీ తీరి ఇంటింటా సంతోషం వెల్లివిరుస్తున్నది. మీరు కారణజన్ములు, మీ జన్మదినం తెలంగాణకు పండుగరోజు. తెలంగాణ తల్లి రుణం తీర్చుకున్న ఈ ముద్దు బిడ్డ నిండు నూరేళ్లూ ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని ఐదు కోట్ల ప్రజానీకం ఆశీర్వదిస్తున్నది.
ప్రియతమ నేతకు హృదయపూర్వక పుట్టినరోజు’ అంటూ కేసీఆర్ తో కలిసి దిగిన ఫొటోను షేర్ చేశారు.
బండి సంజయ్ శుభాకాంక్షలు..
తెలంగాణ బీజేపీ ఛీఫ్ Bundy Sanjay ట్వీట్ చేస్తూ..‘గౌరవ ముఖ్యమంత్రి శ్రీ కె. చంద్రశేఖర్ రావు గారు, మీకు హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. మీరు నిండు నూరేళ్ళు ఆయురారోగ్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా ఆ భగవంతున్ని ప్రార్థిస్తున్నాను’ అని పోస్ట్ చేశారు.
ప్రధాని మోడీ శుభాకాంక్షలు..
కేసీఆర్, కేంద్రానికి ఈ మధ్య కాలంలో రగులుతున్న గొడవల మధ్యలో కూడా ప్రధాని Narendra Modi.. శుభాకాంక్షలు తెలిపి హుందాగా వ్యవహరించారు. (తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి జన్మదిన శుభాకాంక్షలు, మీరు దీర్ఘకాలం ఆయురారోగ్యాలతో ఉండాలంటూ ట్వీట్ చేశారు.
నాన్నకు ప్రేమతో..
ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తన తండ్రికి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. ‘ప్రతీరోజూ ఏదో కొత్త విషయం మీ దగ్గర నేర్చుకుంటూనే ఉంటాను. మీరొక విశ్వవిద్యాలయం లాంటివారు. మీరు దీర్ఘాయుష్సుతో, ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుకుంటున్నా’ అని ట్వీట్ చేశారు. దీనికి #MyHero #HappyBirthday KCR అంటూ హ్యష్ ట్యాగ్ లు పెట్టారు.
కేసీఆర్ కు శుభాకాంక్షలు తెలిపిన వారిలో మెగాస్టార్ చిరంజీవి, బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్, టీఎస్ ఆర్టీసీ ఛైర్మన్ బాజిరెడ్డి గోవర్థన్ రెడ్డి, స్మితా సబర్వాల్ ఉన్నారు.