KCR Birth day: నిరసనకు పిలుపు, టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అరెస్ట్..

Published : Feb 17, 2022, 10:17 AM ISTUpdated : Feb 17, 2022, 11:29 AM IST
KCR Birth day: నిరసనకు పిలుపు, టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అరెస్ట్..

సారాంశం

తెలంగాణ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిని (Revanth Reddy) పోలీసులు అరెస్ట్ చేశారు. హైదరాబాద్‌‌ జూబ్లీహిల్స్‌లోని రేవంత్ రెడ్డి నివాసం వద్ద ఆయన‌ను పోలీసులు అదుపులోకి తీసుకన్నారు. 

తెలంగాణ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిని (Revanth Reddy) పోలీసులు అరెస్ట్ చేశారు. హైదరాబాద్‌‌ జూబ్లీహిల్స్‌లోని రేవంత్ రెడ్డి నివాసం వద్ద ఆయన‌ను పోలీసులు అదుపులోకి తీసుకన్నారు. అనంతరం రేవంత్ రెడ్డిని పోలీసులు వారి వాహనాల్లోనే తిప్పుతున్నట్టుగా తెలుస్తోంది. తొలుత జూబ్లీహిల్స్ నుంచి లంగర్‌హౌస్ వైపు తీసుకెళ్లిన పోలీసులు.. తర్వాత ఆయనను గోల్కొండ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. నేడు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ బర్త్ డే సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నిరసనలకు పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. వివిధ రూపాల్లో నిరసన తెలపాలని యువజన కాంగ్రెస్ పేర్కొంది. 

ఈ క్రమంలోనే ముందస్తు చర్యల్లో భాగంగా పోలీసులు రేవంత్ రెడ్డిని అరెస్ట్ చేశారు. రేవంత్ ఇంటి నుంచి బయటకు వచ్చే సమయంలో పోలీసులు ఆయనను అదుపులోకి తీసుకున్నారు. అయితే రేవంత్ రెడ్డి అరెస్ట్‌పై కాంగ్రెస్ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. రేవంత్‌ను పోలీసులు అదుపులోకి తీసుకుంటున్న సమయంలో కాంగ్రెస్ కార్యకర్తలు వారికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. 

ఇక, ఈ పరిణామాలపై రేవంత్ రెడ్డి ట్విట్టర్ వేదికగా స్పందించారు. కేసీఆర్ జన్మదినం...ప్రతిపక్ష నేతల జైలుదినం కావాలా అని ప్రశ్నించారు. నిరుద్యోగుల తరపున ప్రశ్నించడమే తాము చేసిన నేరమా అంటూ ప్రశ్నలు సంధించారు. ఉద్యోగాల భర్తీకి మెగా నోటిఫికేషన్ డిమాండ్ చేస్తూ అన్నీ మండల కేంద్రాల్లో కేసీఆర్ దిష్ఠిబొమ్మను దగ్ధం చేయాలని కాంగ్రెస్ శ్రేణులకు రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. #TelanganaUnemployementDay అనే హ్యాష్ ట్యాగ్‌ను కూడా జత చేశారు. 

 

సీఎం కేసీఆర్ ఆయన నీడకు కూడా భయపడుతున్నారని విమర్శించారు. నిరుద్యోగ యువత ప్రాణాలు వదులుతున్నారని...ఇది సంబరాలు చేసుకునే సమయమా..? అంటూ ప్రశ్నించారు.
 

 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Kalvakuntla Kavitha: సీఎం రేవంత్ రెడ్డిపై రెచ్చిపోయిన కల్వకుంట్ల కవిత | Asianet News Telugu
Revanth Reddy Press Meet: సర్పంచ్ ల గెలుపు పై రేవంత్ రెడ్డి ప్రెస్ మీట్ | Asianet News Telugu