మరో గుడ్ న్యూస్ ప్రకటించిన కేసీఆర్.. ఉద్యోగ అభ్యర్థుల గరిష్ఠ వయోపరిమితి పెంపు..

Published : Mar 09, 2022, 12:22 PM ISTUpdated : Mar 09, 2022, 12:23 PM IST
మరో గుడ్ న్యూస్ ప్రకటించిన కేసీఆర్.. ఉద్యోగ అభ్యర్థుల గరిష్ఠ వయోపరిమితి పెంపు..

సారాంశం

తెలంగాణలోని నిరుద్యోగులకు ముఖ్యమంత్రి కేసీఆర్ అసెంబ్లీ వేదికగా శుభవార్త వినిపించారు. తక్షణమే 80,039 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్టు ప్రకటించారు. అంతేకాకుండా ఉద్యోగ అభ్యర్థుల గరిష్ట వయోపరిమితి పెంచుతూ మరో గుడ్ న్యూస్ చెప్పారు.  

తెలంగాణలోని నిరుద్యోగులకు ముఖ్యమంత్రి కేసీఆర్ అసెంబ్లీ వేదికగా శుభవార్త వినిపించారు. రాష్ట్రంలో 91,142 ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని చెప్పారు. తక్షణమే 80,039 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్టు ప్రకటించారు. మిగిలిన 11,103 కాంట్రాక్ట్ ఉద్యోగులను క్రమబద్దీకరించనున్నట్టు వెల్లడించారు. అంతేకాకుండా ఉద్యోగ అభ్యర్థుల గరిష్ట వయోపరిమితి పెంచుతూ మరో గుడ్ న్యూస్ చెప్పారు. ఉద్యోగ నియామకాల్లో వయో పరిమితి పెంచుతూ కేసీఆర్ ప్రకటన చేశారు.

ఉద్యోగ అభ్యర్థుల వయోపరిమితిని పదేళ్లు పెంచినట్టుగా కేసీఆర్ ప్రకటించారు.  ఇది చాలా కాలంగా ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థుల పెద్ద ఊరట కలిగించనుంది.  ఉద్యోగాల భర్తీకి వయోపరిమితి ఓసీ అభ్యర్థులకు 44, ఎస్సీ, ఎస్టీ, బీసీలకు 49, దివ్యాంగులు 54 ఏళ్లుగా ప్రభుత్వం నిర్ణయించినట్టుగా సీఎం చెప్పారు. ఎక్స్ సర్వీస్‌మెన్లకు 47 ఏళ్లకు గరిష్ట వయోపరిమితిని పెంచినట్టుగా తెలిపారు. అయితే హోంశాఖలో మాత్రం వయోపరిమితి మినహాయింపు ఉండదు. 

ఇక, కొత్తగా భర్తీ చేయనున్న ఉద్యోగాల ద్వారా ఏటా 7వేల కోట్ల అదనపు భారం ప్రభుత్వంపై పడుతుందని చెప్పారు. ప్రభుత్వ ఉద్యోగాలకు సంబంధించిన ఖాళీలను ముందే గుర్తించి.. ప్రతి సంవత్సరం ఉద్యోగ క్యాలెండర్ విడుదల చేయనున్నట్టుగా ప్రకటించారు. పారదర్శకంగా ఉద్యోగుల భర్తీ చేపడతామని వెల్లడించారు. కొత్త జోనల్ వ్యవస్థ ఆధారంగా పోస్టుల భర్తీ జరుగుతుందని చెప్పారు. అటెండర్ నుంచి ఆర్డీవో వరకు స్థానికులకే 95 శాతం రిజర్వేషన్లు ఉంటాయని కేసీఆర్ స్పష్టం చేశారు. ఇకపై తెలంగాణలో కాంట్రాక్టు పద్దతిలో ఉద్యోగ నియామకాలు ఉండవని కేసీఆర్ స్పష్టం చేశారు. ఇక, ఉద్యోగ ఖాళీల విషయానికి వస్తే..

ఉద్యోగాలు..
గ్రూప్1- 503
గ్రూపు 2- 582
గ్రూప్ 3- 1,373
గ్రూప్ 4- 9,168
జిల్లా స్ధాయిలో- 39,829
జోనల్ స్థాయిలో- 18,866
మల్టీజోన్‌లలో- 13,170
ఇతర కేటగిరి.. వర్సిటీలు- 8,174

శాఖల వారీగా ఖాళీలు..
1. హోం శాఖ- 18,334
2. సెకండరీ ఎడ్యూకేషన్-13,086
3. ఆరోగ్య, వైద్య, కుటుంబ సంక్షేమం- 12,755
4. హయ్యర్ ఎడ్యూకేషన్- 7,878
5. బీసీల సంక్షేమం- 4,311
6. రెవెన్యూ శాఖ- 3,560
7. షెడ్యూల్ కులాల డెవలప్‌మెంట్ డిపార్ట్‌మెంట్- 2,879
8. ఇరిగేష్ అండ్ కమాండ్ ఏరియా డెవలప్‌మెంట్- 2,692
9. ట్రైబల్ వెల్ఫేర్- 2,399
10. మైనారిటీ వెల్పేర్- 1,825
11. ఎన్విరాన్‌మెంట్, ఫారెస్ట్, సైన్స్ అండ్ టెక్నాలజీ- 1,598
12. పంచాయతీ రాజ్ అండ్ రూరల్ డెవలప్‌మెంట్- 1,455
13. లేబర్ అండ్ ఎంప్లాయిమెంట్- 1,221
14. ఆర్థిక శాఖ- 1,146
15. మహిళ, శివు, వికలాంగుల, సీనియర్ సిటిజన్స్- 895
16. మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్‌మెంట్- 859
17. అగ్రికల్చర్ అండ్ కో అపరేషన్- 801
18. ట్రాన్స్‌పోర్ట్, రోడ్లు, భవనాలు- 563
19. న్యాయ శాఖ- 386
20. పశుసంవర్ధక అండ్ చేపల పెంపకం- 353
21. జనరల్ అడ్మినిస్ట్రేషన్- 343
22. ఇండస్ట్రీస్ అండ్ కామర్స్- 233
23. యూత్ అడ్వాన్స్‌మెంట్, టూరిజం, కల్చర్- 184
24. ప్లానింగ్- 136
25. పౌర సరఫరాల శాఖ- 106
26. లేజిస్లేచర్- 25
27. ఎనర్జీ- 16
 

PREV
click me!

Recommended Stories

IMD Rain Alert : ఈ ఐదు జిల్లాలకు పొంచివున్న పిడుగుల గండం... తస్మాత్ జాగ్రత్త
IndiGo Airlines Hyderabad: ఇండిగో విమానాలు ఆలస్యం.. ఎయిర్‌పోర్ట్‌లో గందరగోళం | Asianet News Telugu