ఒక్క పోస్టు కూడా అదనంగా లేదు: ప్రభుత్వ ఉద్యోగాల భర్తీపై కేసీఆర్ ప్రకటనపై జీవన్ రెడ్డి

Published : Mar 09, 2022, 11:53 AM ISTUpdated : Mar 09, 2022, 12:27 PM IST
ఒక్క పోస్టు కూడా అదనంగా లేదు: ప్రభుత్వ ఉద్యోగాల భర్తీపై కేసీఆర్ ప్రకటనపై జీవన్ రెడ్డి

సారాంశం

తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీలో ప్రభుత్వ ఉద్యోగాల పోస్టుల భర్తీ విషయమై సీఎం కేసీఆర్ చేసిన ప్రకటనపై కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి స్పందించారు. ఏ జిల్లాకు కూడా  కొత్తగా ఒక్క పోస్టును కూడా ఇవ్వలేదని జీవన్ రెడ్డి విమర్శించారు.   

హైదరాబాద్:  రాష్ట్రంలోని ఏ జిల్లాలో కూడా అదనంగా ఒక్క పోస్టు ఇవ్వలేదని కాంగ్రెస్ ఎమ్మెల్సీ Jeevanr Reddy విమర్శించారు.రాష్ట్రంలో 80,039 Government Jobs పోస్టులను భర్తీ చేస్తామని అసెంబ్లీలో సీఎం KCR  బుధవారం నాడు  ప్రకటించారు. ఈ విషయమై అసెంబ్లీ మీడియా పాయింట్ లో జీవన్ రెడ్డి మాట్లాడారు.  కొత్తగా జిల్లాలను ఏర్పాటు చేసినా ఒక్క పోస్టు కూడా కొత్త జిల్లాల్ో అదనంగా ఇవ్వలేదని జీవన్ రెడ్డి విమర్శించారు. అదనపు ఉద్యోగాల కోసం నిరుద్యోగులు ఆత్మ బలిదానాలు  చేసుకొన్నారన్నారు.

శాఖలను కుదించి ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారని జీవన్ రెడ్డి కేసీఆర్ సర్కార్ పై మండిపడ్డారు. ఐటీ ఉద్యోగాల్లో హైద్రాబాద్ యువత వాటా ఎంత అని ఆయన ప్రశ్నించారు. Zonal విధానం అమలుకు ఎందుకు జాప్యం చేశారని ఆయన ప్రశ్నించారు. విద్యా శాఖలో 18 వేలకు పైగా ఖాళీలుంటే కేవలం 13 వేల పోస్టులను మాత్రమే భర్తీ చేస్తున్నారన్నారు.  నిరుద్యోగ భృతిని ఇస్తామని గతంలో TRS సర్కార్ హామీ ఇచ్చిందన్నారు. 

ప్రతి నెల నిరుద్యోగులకు రూ.3016  నిరుద్యోగ భృతిగా ఇస్తామని మంత్రి KTR  హామీ ఇచ్చిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. ఏడాది కాలంగా నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి ఏమైందని ఆయన ప్రశ్నించారు. ప్రభుత్వ రంగంలో ఉపాధి అవకాశాలు ఎంత అని ఆయన ప్రశ్నించారు. ఏపీ రాష్ట్రంలో ప్రైవేట్ రంగంలో కూడా ఉద్యోగాల కల్పనలో Reservations కూడా అమలు చేస్తున్నారని జీవన్ రెడ్డి గుర్తు చేశారు. 

1లక్ష 91ఉద్యోగాలు ఖాళీలు ఏడాది క్రితమే ప్రకటించారన్నారు. ఇప్పుడు 2లక్షలకు పైగా ఖాళీలు ఉన్నాయని జీవన్ రెడ్డి చెప్పారు.ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి  జాబ్  కాలెండర్  విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు. పూర్తి స్థాయిలో ఖాళీలను భర్తీ చేయకుండా  మన ఊరు మన బడి ఎలా కొనసాగిస్తారని జీవన్ రెడ్డి ప్రశ్నించారు.

 ప్రతి పాఠశాలలో ఉపాధ్యాయులను నియామకం చేసుకునే పరిస్థితి లేదని చెప్పారు. సీఎం కేసీఆర్ కు శిత్తశుద్ధి ఉంటే బిస్వాల్ కమిటీ నివేదిక ప్రకారం పోస్టుల భర్తీ చేయాలని ఆయన డిమాండ్ చేశారు.   అన్ని శాఖల్లో ఖాళీలను భర్తీ చేయాలన్నారు. కనీసం టీచర్ ఎలిజిబులిటి టెస్ట్ నిర్వహించుకునే పరిస్థితి లేదని జీవన్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. 
 

PREV
click me!

Recommended Stories

IMD Rain Alert : ఈ ఐదు జిల్లాలకు పొంచివున్న పిడుగుల గండం... తస్మాత్ జాగ్రత్త
IndiGo Airlines Hyderabad: ఇండిగో విమానాలు ఆలస్యం.. ఎయిర్‌పోర్ట్‌లో గందరగోళం | Asianet News Telugu