
హైదరాబాద్: Telangana రాష్ట్రంలో New Zonal ను ప్రభుత్వం ప్రకటించింది. రెండు మల్టీ జోన్లలో ఏడు కొత్త జోన్లను ఏర్పాటు చేశారు.Multi zone అంటే రాష్ట్ర స్థాయి పోస్టులను భర్తీ చేస్తారు. మల్టీజోన్ 1 లో జోన్ 1 నుండి జోన్ -5 వరకు ఏర్పాటు చేశారు. మల్టీజోన్ -2 లో జోన్ -6 నుండి జోన్ -7 ఉంటాయి.
జోన్ -1 ను కాశేళ్వరం జోన్ గా పిలుస్తారు. కాళేశ్వరం జోన్ లో ఆసిఫాబాద్, కొమరం భీమ్, మంచిర్యాల, పెద్దపల్లి, జయంశకంర్ భూపాలపల్లి, ములుగు జిల్లాలున్నాయి. జోన్ -2 ను బాసర జోన్ గా గుర్తించారు. ఈ జోన్ లో ఆదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల జిల్లాలున్నాయి. జోన్ -3 లో రాజన్న గా పిలవనున్నారు. ఈ జోన్ లో కరీంనగర్, సిరిసిల్ల, సిద్దిపేట, మెదక్, కామారెడ్డి జిల్లాలున్నాయి. జోన్ -4 ను భద్రాధ్రి జోన్ గా పిలుస్తారు., ఈ జోన్ లో భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, మహబూబాబాద్, వరంగల్ రూరల్, హన్మకొండ జిల్లాలున్నాయి. జోన్ 5 కి యాద్రాద్రిగా నామకరణం చేశారు. ఈ జోన్ లో సూర్యాపేట, నల్గొండ, యాద్రాద్రి భువనగిరి, జనగామ జిల్లాలున్నాయి.
ఇక మల్టీ జోన్ -2 లో జోన్ 6, జోన్ 7లు వస్తాయి. జోన్ 6 ను చార్మినార్ జోన్ గా పిలుస్తున్నారు. ఈ జోన్ లో మేడ్చల్ మల్కాజిగిరి, హద్రాబాద్, రంగారెడ్డి, సంగారెడ్డి, వికారాబాద్ జిల్లాలున్నాయి. జోన్-7 లో మహబూబ్‌నగర్, నారాయణపేట, జోగుళాంబ గద్వాల, వనపర్తి,నాగర్ కర్నూల్ జిల్లా