తెలంగాణ కాంగ్రెస్‌లో ‘ఈటల’ చిచ్చు.. భట్టివిక్రమార్క‌పై కేసీ వేణుగోపాల్ ఆగ్రహం

Published : Nov 13, 2021, 05:01 PM IST
తెలంగాణ కాంగ్రెస్‌లో ‘ఈటల’ చిచ్చు.. భట్టివిక్రమార్క‌పై కేసీ వేణుగోపాల్ ఆగ్రహం

సారాంశం

హుజురాబాద్ ఉప ఎన్నిక(huzurabad bypoll) ఓటమితో తెలంగాణ కాంగ్రెస్‌లో చెలరేగిన మంటలు ఇంకా చల్లారడం లేదు. నేడు ఢిల్లీ‌లో ఏఐసీసీ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ (kc venugopal) సమక్షంలో హుజురాబాద్ ఓటమిపై సమీక్ష జరిగింది. ఈ సందర్భంగా ఈటల రాజేందర్ (etela rajender) గురించి కూడా ప్రస్తావన వచ్చింది. ఇందుకు సంబంధించి మల్లు భట్టివిక్రమార్క (bhatti vikramarka) చేసిన కామెంట్స్‌పై కేసీ వేణు గోపాల్ సీరియస్ అయ్యారు.  

హుజురాబాద్ ఉప ఎన్నిక (huzurabad bypoll) ఓటమితో తెలంగాణ కాంగ్రెస్‌లో చెలరేగిన మంటలు ఇంకా చల్లారడం లేదు. నేడు ఢిల్లీ‌లో ఏఐసీసీ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ (kc venugopal) సమక్షంలో హుజురాబాద్ ఓటమిపై సమీక్ష జరిగింది. ఇందుకు సంబంధించిన తెలంగాణ నుంచి కాంగ్రెస్ సీనియర్ నేతలు హాజరయ్యారు. ఈ సందర్భంగా హుజురాబాద్‌ ఓటమిపై సమీక్షలో వాడి వేడి చర్చ సాగింది. ఉదయం గంటన్నర పాటు ఈ సమావేశం కొనసాగింది. ఈ సమావేశంలో కాంగ్రెస్ నేతలు ఒకరిపై ఒకరు పరస్పర ఆరోపణలు చేసుకున్నారు. ఓటమికి భాద్యులు మీరంటే, మీరేనని పరస్పర విమర్శలు చేసుకన్నారు. ఈ నేపథ్యంలోనే సాయంత్రం మరోసారి సమావేశం కావాలని నిర్ణయించారు. 

ఉదయం జరిగిన సమీక్షలో టీపీసీసీ నేతలు పరస్పర విమర్శలు చేసుకున్నారు. ఓటమికి మీదంటే, మీదే బాధ్యత అని పరస్పరం ఆరోపణలు చేసుకున్నారు. ఈ సందర్భంగా ఈటల రాజేందర్ (etela rajender) గురించి కూడా ప్రస్తావన వచ్చింది. ఈటల రాజందర్‌ను పార్టీలో చేర్చుకుని ఉంటే బాగుండేదని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క (bhatti vikramarka) ఈ సమీక్ష సమావేశంలో ప్రస్తావించారు. అయితే భట్టి వ్యాఖ్యలపై కేసీ వేణు గోపాల్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈటల రాజేందర్‌ను పార్టీలోకి తీసుకోవద్దని ముందు భట్టీనే చెప్పారని, ఇప్పుడు ఇతరులపై నిందలు ఎందుకు వేస్తున్నారని ఫైర్ అయ్యారు. 

Also read: హుజురాబాద్‌‌ సమీక్ష.. ఆ ప్రశ్నకు సమాధానమిచ్చానన్న ఠాగూర్.. జగ్గారెడ్డికి అందని పిలుపు

అంతేకాకుండా ఈ సమీక్షలో మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. సమన్వయ లోపమే హుజురాబాద్‌లో కాంగ్రెస్‌ అభ్యర్థి ఓటమికి కారణమని ఆయన తేల్చి చెప్పారు. ఉత్తమ్‌కుమార్‌రెడ్డి (uttam kumar reddy) సోదరుడు (కజిన్‌) కౌశిక్‌రెడ్డికి (koushik reddy) ఎమ్మెల్సీ ఇప్పించుకున్నారంటూ పొన్నం సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇలాగే కొనసాగితే, వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో కూడా కాంగ్రెస్‌ తుడిచిపెట్టుకుపోవడం ఖాయమని ప్రభాకర్ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా కొందరు నాయకులు ఆయన మాటలకు అడ్డురావడంతో.. పొన్నం ఇంకా రెచ్చిపోయారు. 

Also read: కాంగ్రెస్‌లో టీఆర్ఎస్ కోవర్టులు .. ఇలాగైతే పార్టీ క్లోజే : ఢిల్లీ పెద్దల ముందే పొన్నం ప్రభాకర్ ఆరోపణలు

దమ్ముంటే పార్టీ నుంచి తనను సస్పెండ్‌ చేయాలంటూ సవాల్‌ విసిరారు. ఉపఎన్నిక ఇన్‌చార్జ్‌గా తనను బాధ్యుడిని చేసే విమర్శలు అర్థరహితం అంటూ ప్రభాకర్‌ మండిపడ్డారు. హుజురాబాద్ మీదే కాకుండా గతంలో జరిగిన నాగార్జునసాగర్, హుజూర్ నగర్, దుబ్బాక ఓటమి పై కూడా సమీక్షలు నిర్వ హించాలని పొన్నం ప్రభాకర్‌ డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ఉంటూ కొందరు టీఆర్ఎస్ పార్టీకి సహకరిస్తున్నారంటూ ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలో పీసీసీ అధ్యక్షులుగా పనిచేసిన కే కేశవరావు, డీ శ్రీనివాస్‌లు రాజ్యసభ సభ్యులయ్యేందుకు కాంగ్రెస్‌ పార్టీని మోసం చేశారంటూ పొన్నం ప్రభాకర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. 

ఈ సమీక్షకు తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇంచార్జ్ మాణిక్కం ఠాగూర్, పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, సీనియర్ నేతలు దామోదర రాజనర్సింహ, వీహెచ్, పొన్నం ప్రభాకర్, దుద్దిళ్ల శ్రీధర్ బాబు, షబ్బీర్ అలీ పాల్గొన్నారు. 

PREV
click me!

Recommended Stories

IMD Cold Wave Alert : ఈ సీజన్లోనే కూలెస్ట్ మార్నింగ్స్ .. 14 జిల్లాల్లో ఆరెంజ్, 19 జిల్లాల్లో ఎల్లో అలర్ట్
Telangana Panchayat Elections: తొలి విడత పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ జోరు