
Karimnagar: కరీంనగర్ నగరంలో కరుడుగట్టిన ఘరానా దొంగను పోలీసులు అరెస్ట్ చేశారు. గత కొద్ది రోజులుగా నగర వాసులకు కునుకు లేకుండా చేసిన దొంగ ఎట్టకేలకు పోలీసులకు చిక్కాడు. నగరంలో తాళాలు వేసి ఉన్న ఇండ్లనే లక్ష్యంగా చేసుకొని దొంగతనాలకు పాల్పడుతున్న బక్క శెట్టి కొమురయ్య ఏలియాస్ అజయ్ ను పోలీసులు అరెస్టు చేశారు. భగత్ నగర్ లో దొంగతనం చేసి తప్పించుకోగా పోలీసులు సీసీ కెమోరాల సహాయంతో చాకచక్యంగా పట్టుకున్నట్టు తెలిపారు.
ఈ సందర్భంగా ఏసీబీ తుల శ్రీనివాసరావు మీడియాతో మాట్లాడుతూ.. బక్క శెట్టి కొమురయ్య ఏలియాస్ అజయ్ అనే నిందితుడు 2009 నుండి దొంగతనాలనే వృత్తిగా చేసుకొని జీవనం సాగిస్తున్నాడని తెలిపారు. నగరంలోనే కాకుండా జిల్లాలోని పలు ప్రాంతాల్లో దొంగతనాలకు పాల్పడినట్టు ఆరోపణలున్నాయని తెలిపారు. ఈ కేసును చేదించిన వన్ టౌన్ పోలీసులను సిబ్బందిని ఏసిపి అభినందించారు. జగిత్యాల జిల్లాకు చెందిన భక్తి శెట్టి కొమురయ్య ఘరానా దొంగను ట్రైన్ ఐపీఎస్ మహేష్ వన్ టౌన్ పోలీస్ చాకచక్యంగా పట్టుకుని అరెస్ట్ చేసినట్టు ఇతర అధికారులు తెలిపారు. గత 15 సంవత్సరాల దొంగతనాన్ని వృత్తిగా చేసుకొన్న నిందితుడు వద్ద నుండి బంగారం,వెండి, నగదును స్వాధీనం చేసుకొని రిమాండ్ కు తరలించారు.