
గ్రూప్ 4 అభ్యర్ధులకు శుభవార్త చెప్పింది తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమీషన్. అభ్యర్ధులు తమ అప్లికేషన్లను ఎడిట్ చేసుకునేందుకు అవకాశం కల్పించింది. కొద్దిరోజుల క్రితం 8,039 గ్రూప్ 4 పోస్ట్‌ల భర్తీకి టీఎస్‌పీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనికి అభ్యర్ధుల నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. దాదాపు 9 లక్షల మంది గ్రూప్ 4 పోస్ట్‌లకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకున్నారు. అయితే ఈ సమయంలో చాలా మంది తప్పులు చేశారు.
కానీ ఒకసారి అప్లికేషన్ సబ్మిట్ కొట్టిన తర్వాత ఎడిట్ ఆప్షన్ లేకపోవడంతో వారంతా ఆందోళనకు గురయ్యారు. ఈ నేపథ్యంలో తమకు ఎడిట్ ఆప్షన్ ఇవ్వాలంటూ అభ్యర్ధులు ప్రభుత్వాన్ని కోరారు. దీనిపై సానుకూలంగా స్పందించిన టీఎస్‌పీఎస్సీ ఎడిట్ ఆప్షన్ ఇచ్చేందుకు అంగీకరించింది. మే 9 నుంచి 15 వరకు అభ్యర్ధులు తమ అప్లికేషన్లను ఎడిట్ చేసుకోవచ్చని సూచించింది. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి వుంది.