రేపు ప్రధాని నరేంద్ర మోడీతో భేటీ కానున్న బండి సంజయ్.. ఏం జరుగుతోంది..?

Siva Kodati |  
Published : Aug 02, 2023, 05:37 PM IST
రేపు ప్రధాని నరేంద్ర మోడీతో భేటీ కానున్న బండి సంజయ్.. ఏం జరుగుతోంది..?

సారాంశం

తెలంగాణ బీజేపీ మాజీ అధ్యక్షుడు, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ రేపు ప్రధాని నరేంద్ర మోడీతో భేటీ కానున్నారు. అనంతరం ఎల్లుండి బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు స్వీకరించనున్నారు. 

తెలంగాణ బీజేపీ మాజీ అధ్యక్షుడు, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ రేపు ప్రధాని నరేంద్ర మోడీతో భేటీ కానున్నారు. గురువారం ఉదయం 11 గంటలకు కుటుంబ సమేతంగా మోడీని కలవనున్నారు సంజయ్. అనంతరం ఎల్లుండి ఉదయం ఢిల్లీలోని బీజేపీ కేంద్ర కార్యాలయంలో ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు స్వీకరించనున్నారు. 

కాగా.. తెలంగాణ బీజేపీ అధ్యక్ష పదవి నుంచి తొలగించిన తర్వాత ఎంపీ బండి సంజయ్‌కి ఎలాంటి పదవి కేటాయించలేదు అధిష్టానం. దీనిపై కనీసం క్లారిటీ కూడా ఇవ్వలేదు. అలాంటి పరిస్ధితుల్లో రెండ్రోజుల క్రితం బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా నియమించింది. ఇదే సమయంలో సంజయ్ గురించి సోషల్ మీడియాలో కీలక ప్రచారం కూడా జరుగుతోంది. ఏపీ బీజేపీ ఇన్‌ఛార్జ్‌గా బండిని నియమించనున్నారన్నది దాని సారాంశం. ప్రస్తుతం ఏపీ బీజేపీ ఇన్‌ఛార్జ్‌గా వున్న సునీల్ దేవధర్‌ను జాతీయ కార్యవర్గం నుంచి తొలగించడం దీనికి బలం చేకూరుస్తోంది. 

ALso Read: గంగుల కమలాకర్ ఎన్నికల వివాదం కేసు.. బండి సంజయ్ కు క్రాస్ ఎగ్జామినేషన్‌..

ఈ పరిణామాలు నేపథ్యంలో ఏపీ బీజేపీ ఇన్‌ఛార్జ్‌గా సునీల్ స్థానంలో మరో నాయకుడిని నియమించాల్సి వుంది. ఈ నేపథ్యంలోనే బండి సంజయ్ పేరు తెరపైకి వచ్చింది. ఆంధ్రప్రదేశ్ బీజేపీలో ఫైర్ బ్రాండ్ అనదగ్గ నేత లేరు. ఇలాంటి పరిస్ధితుల్లో సంజయ్‌కి కనుక పగ్గాలు అప్పగిస్తే మంచిదేననే చర్చ పార్టీలో జరుగుతోంది. మరి ఇది గాలివార్తా లేక దీనిపై ఢిల్లీ పెద్దల నుంచి లీకులు వచ్చాయా అంటూ ప్రచారం జరుగుతోంది.    
 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

IMD Rain Alert : సంక్రాంతి పండగపూట తెలంగాణలో వర్షాలు... ఈ రెండు జిల్లాలకు రెయిన్ అలర్ట్
చైనా మంజాను ఎలా త‌యారు చేస్తారో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే.. ప్రాణాలు పోయేంత ప్ర‌మాదం ఎందుకు.?