సినీ నటి జయసుధ ఇవాళ బీజేపీలో చేరారు. తెలంగాణలోని ముషీరాబాద్ లేదా సికింద్రాబాద్ అసెంబ్లీ స్థానం నుండి జయసుధ పోటీ చేసే అవకాశం ఉంది.
న్యూఢిల్లీ: సినీ నటి జయసుధ బుధవారంనాడు బీజేపీలో చేరారు. బీజేపీ తెలంగాణ రాష్ట్ర ఇంచార్జీ తరుణ్ చుగ్ పార్టీ సభ్యత్వం జయసుధకు అందించారు. పార్టీ కండువా కప్పి ఆమెకు పార్టీలోకి స్వాగతం పలికారు తరుణ్ చుగ్. బీజేపీ కేంద్ర కార్యాలయంలో ఇవాళ సాయంత్రం జయసుధ బీజేపీలో చేరారు.
9 ఏళ్లుగా మోడీ నాయకత్వంలో దేశం ఎంతో అభివృద్ది చెందిన విషయాన్ని ఆమె గుర్తు చేశారు. ఏడాదిగా బీజేపీ నేతలు తనతో సంప్రదింపులు జరుపుతున్నారని ఆమె చెప్పారు. మంచి మార్పు కోసం బీజేపీలో చేరినట్టుగా జయసుధ చెప్పారు.
సినిమాలకంటే రాజకీయాలకే ప్రాధాన్యత ఇస్తానన్నారు.సికింద్రాబాద్, ముషీరాబాద్ నుండి పోటీ చేస్తారనేది ప్రచారం మాత్రేమనన్నారు..పేదలకు మంచిచేయాలనే ఉద్దేశ్యంతో బీజేపీలో చేరానని ఆమె తెలిపారు. కులమతాలపరంగా పనిచేస్తానన్నారు. ప్రతి దానికి టైమ్ వస్తుందన్నారు. టైం ను గౌరవించాలన్నారు.
జయసుధకు మంచి పేరుందని బీజేపీ తెలంగాణ ఇంచార్జీ తరుణ్ చుగ్ చెప్పారు. సినిమా రంగంలో ఆమెకు అనేక అవార్డులు వచ్చాయన్నారు. జయసుధ బీజేపీలో చేరడాన్ని ఆయన స్వాగతించారు.జయసుధ గతంలో ఎమ్మెల్యేగా పనిచేసిన సమయంలో తాను కూడ అసెంబ్లీలో ఎమ్మెల్యేగా ఉన్న విషయాన్ని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గుర్తు చేసుకున్నారు. పేద ప్రజల అభ్యున్నతి కోసం జయసుధ ఎంతో చేశారన్నారు. మురికివాడలు, బస్తీల అభివృద్ది కోసం జయసుధ చేసిన కృషిని మంత్రి కిషన్ రెడ్డి గుర్తు చేశారు.
also read:న్యూఢిల్లీకి చేరుకున్న సినీనటి : నేడు బీజేపీలోకి జయసుధ
నిన్న రాత్రే జయసుధ న్యూఢిల్లీకి చేరుకున్నారు. ఇవాళ సాయంత్రం బీజేపీలో చేరారు. బీజేపీలో చేరడానికి ముందు ఆమె కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాతో భేటీ అయ్యారు. ఈ భేటీ ముగిసిన తర్వాత ఆమె బీజేపీలో చేరారు. బీజేపీ కేంద్ర కార్యాలయం నుండి ఆమె ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో భేటీ కావడానికి వెళ్లారు.వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో సికింద్రాబాద్ లేదా ముషీరాబాద్ అసెంబ్లీ స్థానాలనుండి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసే అవకాశం ఉంది.