
Telangana Kanti Velugu: తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన ఉచిత సామూహిక కంటి పరీక్షల కార్యక్రమం "కంటి వెలుగు" ముమ్మరంగా కొనసాగుతోంది. కంటి వెలుగు కింద కేవలం 25 పనిదినాల వ్యవధిలోనే గురువారం నాటికి 50 లక్షల మందికి కంటి పరీక్షలు నిర్వహించారు. అవసరమైన వారికి వైద్య సదుపాయ వివరాలు తెలుపుతూ కంటి అద్దాలను అందించినట్టు సంబంధిత వర్గాలు వెల్లడించాయి. కాగా, జనవరి 18న ఖమ్మంలో ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు (కేసీఆర్) ప్రారంభించిన కంటి వెలుగు కార్యక్రమం రెండో దశలో 100 పనిదినాల్లో 16,533 వేర్వేరు ప్రాంతాల్లో మొత్తం 1.5 కోట్ల మందికి స్క్రీనింగ్ చేయాలన్న లక్ష్యాన్ని చేరుకునే దిశగా అడుగులు పడుతున్నాయని సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి.
ప్రపంచంలోనే అతిపెద్ద ఉచిత కంటి స్క్రీనింగ్ కార్యక్రమంగా పేరొందిన కంటి వెలుగు పథకాన్ని తెలంగాణ ప్రభుత్వం జూన్ 15 నాటికి 'కంటి వెలుగు రెండో దశ'ను పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. స్క్రీనింగ్ చేయించుకున్న 50 లక్షల మందిలో 34 లక్షల మందికి (68 శాతం) కంటికి సంబంధించిన వ్యాధులు లేవనీ, 16 లక్షల మందికి వైద్య సహాయం అవసరమని సంబంధిత వర్గాలు వెల్లడించాయి. కంటి స్క్రీనింగ్ శిబిరాల్లో ప్రాథమిక కంటి స్క్రీనింగ్ పరీక్షలు, అక్కడికక్కడే రీడింగ్ గ్లాసెస్ పంపిణీ, సాధారణ కంటి సంబంధిత వ్యాధుల నిర్ధారణ ఉంటుందని అధికారులు తెలిపారు. ప్రిస్క్రిప్షన్ అద్దాల పంపిణీ ఒకటి నుంచి రెండు వారాల వ్యవధిలో ఉంటాయని పేర్కొన్నారు.
వైద్య చికిత్స అవసరమైన 16 లక్షల మందిలో 9.5 లక్షల మందికి రీడింగ్ అద్దాలు, 6.5 లక్షల మందికి ప్రిస్క్రిప్షన్ అద్దాలు అందాయని అధికారులు తెలిపారు. వైద్య సాంకేతిక బృందం సూచించిన ప్రిస్క్రిప్షన్ గ్లాసులను ఆశా, ఏఎన్ఎంలతో సహా స్థానిక క్షేత్రస్థాయి ఆరోగ్య కార్యకర్తల ద్వారా జిల్లాల్లోని లబ్ధిదారులకు అందజేయనున్నట్టు తెలిపారు.
కంటి వెలుగు రెండో దశకు సంబంధించి ప్రస్తుత వివరాలు ఇలా ఉన్నాయి..