కాళేశ్వరంలో కేసీఆర్ పెట్టిన పట్టు చీరలు మాయం.. ఈవోల సస్పెన్షన్

First Published Jul 27, 2018, 4:14 PM IST
Highlights

కాళేశ్వరం ఆలయంలో పట్టు చీరలు మాయమైన ఘటనలో ఇద్దరు ఈవోలపై ప్రభుత్వం సస్పెన్షన్ వేటు వేసింది. మేడిగడ్డ బ్యారేజ్ భూమిపూజ సందర్భంగా 2 మే 2016న సీఎం కేసీఆర్ దంపతులు కాళేశ్వరంలోని ముక్తీశ్వర స్వామిని దర్శించుకుని అమ్మవారు శుభానందాదేవికి తెలంగాణ ఉద్యమం సందర్భంగా మొక్కిన మొక్కులు చెల్లించుకున్నారు

కాళేశ్వరం ఆలయంలో పట్టు చీరలు మాయమైన ఘటనలో ఇద్దరు ఈవోలపై ప్రభుత్వం సస్పెన్షన్ వేటు వేసింది. మేడిగడ్డ బ్యారేజ్ భూమిపూజ సందర్భంగా 2 మే 2016న సీఎం కేసీఆర్ దంపతులు కాళేశ్వరంలోని ముక్తీశ్వర స్వామిని దర్శించుకుని అమ్మవారు శుభానందాదేవికి తెలంగాణ ఉద్యమం సందర్భంగా మొక్కిన మొక్కులు చెల్లించుకున్నారు. ఆ చీరలు ఇప్పుడు మాయమయ్యాయి..

ఆలయ ఉద్యోగుల్లో ఒకరు ఆ చీరను దొంగిలించి దాని స్థానంలో మరో చీరను ఉంచినట్లుగా సమాచారం. దీనిపై విస్తృతంగా కథనాలు రావడంతో ప్రభుత్వం సీరియస్ అయ్యింది. దీనిపై ఇంటెలిజెన్స్ ఐజీ నవీన్ చంద్, జయశంకర్ భూపాలపల్లి జిల్లా ఎస్పీ భాస్కరన్, కలెక్టర్ అమయ్‌కుమార్ ఆధ్వర్యంలో విచారణ కమిటీని నియమించింది.

ఈ కమిటీ విచారణలో చీరలు మాయం నిజమేనని తేలడంతో అప్పట్లో ఆలయ ఈవోలుగా పనిచేసిన హరిప్రసాద్, శ్రీనివాస్‌లపై ప్రభుత్వం సస్పెన్షన్ వేటు వేసింది. దీనిపై మరింత లోతుగా విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకుంటామని ప్రభుత్వం స్పష్టం చేసింది. 

click me!