తెలంగాణ కేబినేట్ భేటీ: ముందస్తు ఎన్నికలపై చర్చ?

First Published Jul 27, 2018, 4:06 PM IST
Highlights

తెలంగాణ కేబినెట్ సమావేశం శుక్రవారం నాడు సీఎం కేసీఆర్ అధ్యక్షతన ప్రారంభమైంది.  సుమారు 42పైగా ఎజెండా అంశాలపై ఈ సమావేశంలో చర్చించనున్నారు. త్వరలో నిర్వహించనున్న కంటి వెలుగు కార్యక్రమంతో పాటు ముందస్తు ఎన్నికల అంశంపై కూడ ఈ సమావేశంలో చర్చించే అవకాశం లేకపోలేదు.

హైదరాబాద్: తెలంగాణ కేబినెట్ సమావేశం శుక్రవారం నాడు సీఎం కేసీఆర్ అధ్యక్షతన ప్రారంభమైంది.  సుమారు 42పైగా ఎజెండా అంశాలపై ఈ సమావేశంలో చర్చించనున్నారు. త్వరలో నిర్వహించనున్న కంటి వెలుగు కార్యక్రమంతో పాటు ముందస్తు ఎన్నికల అంశంపై కూడ ఈ సమావేశంలో చర్చించే అవకాశం లేకపోలేదు.

శుక్రవారం నాడు  మధ్యాహ్నం తెలంగాణ సీఎం కేసీఆర్ అధ్యక్షతన  మంత్రివర్గ సమావేశం ప్రారంభమైంది.  ఈ సమావేశంలో  సుమారు 42 ఎజెండా అంశాలపై చర్చించనున్నారు. వచ్చే నెలలో  కంటి వెలుగు పథకాన్ని ప్రారంభించనున్నారు.  ఈ కార్యక్రమంపై మంత్రివర్గ సమావేశంలో చర్చించనున్నారు. 

మరోవైపు గ్రామకార్యదర్శుల నియామకానికి సంబంధించి కూడ  కేబినెట్ గ్రీన్‌సిగ్నల్ ఇవ్వనుంది. మరోవైపు  గ్రామపంచాయితీల గడువు  వచ్చే నెల 1వ తేదీతో ముగియనుంది. అయితే  గడువులోపుగా ఎన్నికలు పూర్తి చేయాలని భావించినప్పటికీ  కోర్టు కేసు కారణంగా నిర్వహించే పరిస్థితి లేకుండా పోయింది. దీంతో గ్రామపంచాయితీలకు స్పెషల్ ఆఫీసర్లను నియమించనున్నారు.

మరో వైపు  రాష్ట్రంలో నెలకొన్న రాజకీయ పరిస్థితులపై చర్చించే అవకాశం కూడ లేకపోలేదు. ముందస్తు ఎన్నికలకు వెళ్లాలనే ఆలోచనలో టీఆర్ఎస్ నాయకత్వం ఉంది.ఈ విషయమై కూడ ఈ సమావేశంలో చర్చించే అవకాశాలున్నాయి.మరోవైపు తెలంగాణకు హరితహారం కార్యక్రమాన్ని ఆగష్టు రెండో తేదీ నుండి రాష్ట్రంలో ప్రారంభించనున్నారు.

గజ్వేల్ నియోజకవర్గంలో  సీఎం కేసీఆర్ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు.  హరిత హరం కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు తీసుకోవాల్సిన చర్యలపై కూడ ఈ సమావేశంలో చర్చించనున్నారు. 
 

click me!