మిషన్ భగీరథ వరద ఆ ఊరినే ముంచెత్తింది

First Published Jul 27, 2018, 3:05 PM IST
Highlights

తెలంగాణ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న మిషన్ భగీరథ పనులు అధికారుల అలసత్వం వల్ల విమర్శలపాలవుతోంది. కేసీఆర్ మానసపుత్రికగా చెప్పుకుంటున్న ఈ పథకం వల్ల ప్రజల నీటి సమస్య పోవాల్సింది పోయి ఓ గ్రామంలో కొత్త సమస్య మొదలైంది. ఈ నీటి సరఫరా కోసం ఏర్పాటుచేసిన భారీ ఫైపు పగిలి ఏకంగా ఓ ఊరినే ముంచెత్తిన ఘటన కామారెడ్డి జిల్లాలో చోటుచేసుకుంది.

ఎల్లారెడ్డి మండలంలోని అన్నాసాగర్ తండా వద్ద మిషన్ భగీరథ మెయిన్ ఫైప్ లైన్ పగిలిపోయింది. దీంతో భారీగా ఎగిసిపడిన నీరు వరదను తలపించాయి. ఇలా వరదలై పారిన మిషన్ భగీరథ నీరు మోకాళ్ల లోతులో ప్రవహిస్తూ ఊరిలోని ఇండ్లల్లోరి చేరాయి. అలాగే పొలాల్లోకి కూడా చేరి పంటను పాడు చేశాయి. ఇలా ప్రజల సమస్యను తీర్చడానికి తలపెట్టిన పథకం అధికారుల నిర్లక్ష్యం కారణంగా అదే ప్రజలకు ఇబ్బందిగా మారింది.

వర్షాల కారణంగా వరదలు వస్తే ఎలా ఉంటుందో ప్రస్తుతం అన్నాసాగర్ తండా లో పరిస్థితి అలా తయారయ్యింది. పైపు లైన్ పగిలినట్లు వెంటనే అధికారులకు సమాచారమిచ్చినప్పటికి వారు పట్టించుకోకపోవడంతో ఈ పరిస్థితి తలెత్తిందని గ్రామస్తులు వాపోతున్నారు. ఇళ్లలో, బియ్యం, బట్టలు, ఎరువులు, సర్టిఫికెట్లు, నగదు నీళ్లలో తడిచిపోయాయని గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేశారు. 

 మిషన్ భగీరథ పనుల్లో నాణ్యతాలోపం కారణంగా పైపులు పదేపదే లీకు అవుతున్నాయని గ్రామస్థులు మండిపడ్డారు. దీంతో తరచూ ఇబ్బంది పడాల్సి వస్తుందని గ్రామస్తులు తెలిపారు. 

click me!