(వీడియో) కడియం శ్రీహరి ఇలా రాజకీయాల్లోకి వచ్చారు

First Published Apr 22, 2017, 10:06 AM IST
Highlights

ఉప ముఖ్యమంత్రి కడియం రాజకీయాల్లోకి రాకముందు కెమిస్ట్రీ లెక్చరర్ గా పనిచేశారు.అంతకు ముందు ఆయన బ్యాంకు ప్రొబెషనరీ అధికారిగా పనిచేశారు. అయితే బోధనపై ఉన్న మక్కువతో ఎక్కువ జీతం వచ్చే బ్యాంకు ఉద్యోగాన్ని వదిలి లెక్చరర్ గా చేరానని చెప్పారు.

వరంగల్ భారీ బహిరంగ సభకు వచ్చే జనాల దారిఖర్చుల కోసం గులాబీ నేతల కూలి పనులు జోరుగా కొనసాగుతున్నాయి. ఉప ముఖ్యమంత్రి, విద్యాశాఖ మంత్రి  కడియం శ్రీహరి శనివారం వరంగల్ లోని ఎస్వీఎస్ కాలేజీలో ఎంసెట్ పరీక్షలో స్కోరింగ్ సాధించడం ఎలాగో విద్యార్థులకు వివరించారు.

 

తన గతంలో బోధించిన కెమిస్ట్రీ సబెక్టులో మెలుకువలు వివరించి రెండు లక్షల రూపాయలు సంపాదించారు. ఈ డబ్బులను సభకు వచ్చే వారి తాగునీటి అవసరాలకు వినియోగించనున్నట్లు ప్రకటించారు.

 

ఉప ముఖ్యమంత్రి, విద్యాశాఖ మంత్రి కడియం రాజకీయాల్లోకి రాకముందు కెమిస్ట్రీ లెక్చరర్ గా పనిచేశారు. లెక్చరర్ కంటే ముందు ఆయన బ్యాంకు ప్రొబెషనరీ అధికారిగా పనిచేశానన్నారు. అయితే బోధనపై ఉన్న మక్కువతో ఎక్కువ జీతం వచ్చే బ్యాంకు ఉద్యోగాన్ని వదిలి లెక్చరర్ గా చేరానని చెప్పారు. ఆయన తీసుకున్న నిర్ణయాన్ని నాడు ఆయన మిత్రులు ఎద్దేవా చేశారని చెప్పారు.

 కానీ వాటిని లెక్క చేయకుండా ఇష్టం ఉన్న వృత్తి చేయడంలోనే సంతృప్తి ఉందని భావించి లెక్చరర్ గా ఉండడానికే ఇష్టపడ్డానని ఆయన చెప్పారు. బోధనపై ఆయనకున్న మక్కువతో గులాబీ నేతల కూలీ పనుల్లో మళ్లీ లెక్చరర్ అయి పార్టీ కోసం  డబ్బులు సంపాదించాలనుకున్నట్లు చెప్పారు.

 

అనుకున్నట్లుగానే ఒయాసిస్ పాఠశాలలో బోధన చేసి మొదటి రోజు లక్ష రూపాయలు సంపాదించారు. అనంతరం నేడు ఎస్వీఎస్ కాలేజీలో ఎంసెట్ రాయడంలో ఎలాంటి మెలుకువలు పాటించాలి, స్కోరింగ్ సాధించాలంటే పరీక్షా రాసే విధానం ఏ రకమైంది అవలంభించాలనే దానిపై విద్యార్థులకు లెక్చర్ ఇచ్చారు. తర్వాత కెమిస్ట్రీలో రసాయన మూలకాలు, వాటి బందాలు, మూలకాల ఆకృతులపై బోర్డుపై రాసి విద్యార్థులకు బోధించారు. హాలోజన్స్, అమ్మోనియం క్లోరైడ్, పోటాషియం పర్మాంగనేట్, అయానిక్ బాండ్స్ వంటి అంశాలపై విద్యార్థులకున్న సందేహాలు తీర్చి, బాండ్స్ ఎలా ఏర్పడుతాయన్న అంశాన్ని వివరించి చెప్పారు.

ఎంసెట్ లో 160 ప్రశ్నలకు 160 రాయాలి...కనీసం 120 మార్కులు వచ్చేలా ప్లాన్ చేసుకోవాలని ఆయనచెప్పారు.

 

 కాలేజీలో పాఠాలు చెప్పేందుకు వచ్చిన ఉప ముఖ్యమంత్రి, విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరికి కాలేజీ యాజమాన్యం, బోధన సిబ్బంది, విద్యార్థులు సాదర ఆహ్వానం పలికారు. కాలేజీలో పాఠం చెప్పిన తర్వాత రెండు లక్షల చెక్కును ఇవ్వడంతో పాటు ఎస్వీఎస్ కాలేజీ యాజమాని తిరుమల రావు, ఉప ముఖ్యమంత్రి, విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరి శిశువుగా చదువుకున్న నేపథ్యంలో నేడు కడియం శ్రీహరిని సన్మానించి, సత్కరించారు.

click me!